Suma : గుండె ముక్కలైనట్టుగా ఉంది.. రజాకార్ సినిమాపై సుమ రివ్యూ?

ఇటీవల అనసూయ ( Anasuya ) వేదిక ఇంద్రజ వంటి వారందరూ ప్రధాన పాత్రలలో నటించినటువంటి తాజా చిత్రం రజాకార్( Razakar ) .ఈ సినిమా మార్చ్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Anchor Suma Review On Razakar Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పాలి.ఈ సినిమాలో స్వతంత్రం కోసం అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారనే విషయాలను చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు.

సినిమా చూసిన తర్వాత బరువెక్కిన గుండెతో బయటకు వస్తున్నారు.ఇలా ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమాను ఇప్పటివరకు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీలు ఎవరు చూడలేదని తెలుస్తుంది.ఇప్పటివరకు ఒక్కరి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ మాత్రం బయటకు రాలేదు కానీ యాంకర్ సుమ ( Suma ) మాత్రం ఇటీవల సినిమా చూసి ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని బయట పెట్టారు.రజాకార్ సినిమా గురించి సుమ ట్విట్టర్ వేదికగా  ట్వీట్ చేస్తూ.

ఇప్పుడే తాను రజాకార్ సినిమా చూశానని తెలిపారు.ఆ ఘటనలు చూసి నా గుండె ముక్కలైంది.హైద్రాబాద్ సంస్థాన స్వతంత్ర పోరాటాన్ని చక్కగా చూపించారు.

ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్.అనసూయ, ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహా, వేదిక ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైన నటన తీరును కనబరిచారంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు అద్భుతమైనటువంటి రివ్యూ ఇస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక సుమ చేసిన ఈ ట్వీట్ పై నటి వేదిక ( Vedika ) స్పందిస్తూ.థాంక్యూ సుమ అంటూ రిప్లై ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube