బుల్లితెర స్టార్ యాంకర్ సుమకు యాంకరింగ్ విషయంలో కానీ రెమ్యునరేషన్ విషయంలో కానీ పోటీనిచ్చే మరో యాంకర్ తెలుగులో అయితే లేరనే సంగతి తెలిసిందే.మలయాళీ అయినప్పటికీ తెలుగమ్మాయి అనే విధంగా ప్రేక్షకులకు దగ్గరైన సుమ తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు దాదాపుగా ఉండరు.
ప్రస్తుతం యాంకర్ సుమ కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారనే సంగతి తెలిసిందే.
క్యాష్ షోకు బదులుగా ఆ స్థానంలో సుమ హోస్ట్ గా సుమ అడ్డా అనే షో ప్రసారమవుతోంది.
ఈ షోకు యాంకర్ సుమ గతంతో పోల్చి చూస్తే రెమ్యునరేషన్ ను భారీగానే పెంచేశారు.చాలామంది స్టార్ యాంకర్లు ఒక్కో ఎపిసోడ్ కు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటుండగా సుమ అడ్డా షోకు మాత్రం సుమ ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు 1,60,000 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారట.
నెలలో నాలుగు లేదా ఐదు ఎపిసోడ్లు ఈ షో ప్రసారం కానుండగా ఈ షో ద్వారా నెలకు 8 లక్షల రూపాయల రేంజ్ లో సుమ సంపాదిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.సుమ ప్రతిభకు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా తప్పు లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సుమ హోస్టింగ్ వల్లే తెలుగులోని చాలా షోలకు మంచి రేటింగ్స్ వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యాంకర్ సుమ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తక్కువ సంఖ్యలో షోలకు మాత్రమే యాంకర్ గా కొనసాగుతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రం సుమ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.ఏ ఈవెంట్ జరిగినా సుమ యాంకర్ గా ఉండాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.సుమ స్థాయిలో ఇతర యాంకర్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేసే ఛాన్స్ దక్కడం లేదు.సుమ కొడుకు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.