యూట్యూబ్ ద్వారా సుమ నెలకు ఇన్ని లక్షలు సంపాదిస్తుందా... ఎంతైనా సుమక్క రేంజేవేరబ్బా!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు యాంకర్ సుమ. ఈమె బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ మరోవైపు సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Anchor Suma Earnings Through Youtube Channel Details, Suma ,youtube,sumakka , Su-TeluguStop.com

ఇలా వరుస సినిమా ఈవెంట్లు ఇతర కార్యక్రమాల ద్వారా సుమా భారీగానే సంపాదిస్తున్నారు.ఒక్కో ఈవెంట్ కి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే సుమ మరోవైపు సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అదనపు ఆదాయాన్ని అందుకుంటున్నారు.

ఇలా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు భారీగానే సంపాదిస్తున్నారని టెక్ నిపుణుల అభిప్రాయం.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వారికంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎంతోమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.

సుమ కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది వ్యూస్ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఉన్నప్పటికీ వారి కన్నా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా సంపాదిస్తుందనీ తెలుస్తోంది.అయితే సుమ చేసే వ్లాగ్స్ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో చూసే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఈమెకు మంచి ఆదాయం ఉంటుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం సుమ ఒక్కో ఈవెంట్ కు తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా కాస్త తక్కువగానే వచ్చినప్పటికీ భవిష్యత్తులో ఈ వీడియోలు మరింత ఆదాయం తీసుకువస్తాయన్న ఆలోచనలు సుమ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఏదో సరదాగా తాను షూటింగ్లో చేసే ఫన్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం సుమ నెలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమారు మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలా లక్షల్లో డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube