బాలయ్య జోలికి వెళ్లకపోతే బెటర్.. సుమ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ స్టార్ మా ఛానెల్ లో ప్రస్తుతం స్టార్ట్ మ్యూజిక్ అనే షోకు యాంకర్ గా చేస్తూ తన టాలెంట్ తో ఆ షోను సక్సెస్ చేస్తున్నారు.సుమ తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగు నేర్చుకుని అనర్గళంగా మాట్లాడటంతో పాటు పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 Anchor Suma Comments About Hero Balakrishna In Start Music Show , Anchor Suma, B-TeluguStop.com

ఇతర భాషల్లో సక్సెస్ అయిన స్టార్ట్ మ్యూజిక్ షో ఝాన్సీ, శ్రీముఖి యాంకర్లుగా చేసిన సమయంలో సక్సెస్ కాలేదు.

అయితే సుమ యాంకరింగ్ చేస్తున్నప్పటి నుంచి ఈ షో మంచి రేటింగ్ లను సొంతం చేసుకోవడంతో పాటు సుమకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతోంది.

తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ కాగా సీరియల్ నటులు ఈ షోకు గెస్టులుగా హాజరయ్యారు.ఇంటింటి గృహలక్ష్మి, చెల్లెలి కాపురం సీరియల్ నటులు హాజరు కాగా వాళ్లకు సుమ పలకలు ఇచ్చి ముద్దులు పెట్టమని చెప్పారు.

ఆ తరువాత సుమ ముద్దులు మసకమసకగా ఉన్నాయేంటని సీరియల్ నటులను ప్రశ్నించగా చీకట్లో ముద్దులు పెట్టామని సీరియల్ నటులు చెప్పుకొచ్చారు.

ఆ తరువాత సుమ మీరు చెడ్డీలు వేసుకున్నా వేసుకోకపోయినా మాస్క్ లు మాత్రం కచ్చితంగా వేసుకోవాలని సూచనలు చేశారు.

సీరియల్ నటులు స్కూల్ పిల్లల్లా స్కిట్స్ చేయగా సుమ మొదట పవన్ కళ్యాణ్ గారు అనగా ప్రజంట్ మామ్ అని అంటారు.ఆ తరువాత బాలకృష్ణ గారు అనగా సినిమాకెళ్లాడు టీచర్ అని సీరియల్ నటి చెబుతుంది.

అప్పుడు సుమ పోనీలే వెళితే వెళ్లారు మనం ఆయన జోలికి వెళ్లకపోతే బెటర్ అని సుమ అన్నారు.

ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

సుమ తన షోలలో పంచ్ లు వేసి కడుపుబ్బా నవ్విస్తూ వినోదాన్ని పంచుతున్నారు.ప్రోమోలతోనే షోపై అంచనాలు పెంచుతున్న సుమ షోలో ఇంకెంత రచ్చ చేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube