యాంకర్ శ్రీముఖి( Anchor Sreemukhi ).ఈమె గురించి తెలియని సినీ ఇండస్ట్రీ జనాలు ఉండరు.
ఈమె తన గలగలా మాటలతో ఎన్నో సినిమా ఫంక్షన్లకు,ఆడియో రిలీజ్ ఈవెంట్లకు,ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్ గా చేస్తుంది.ఇక శ్రీముఖి కి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం పటాస్ షో ద్వారా.
ఇక బిగ్ బాస్ ( Biggboss ) లోకి వెళ్ళాక శ్రీముఖికి మరింత ఫాలోయింగ్ పెరిగింది.ఓవైపు మంచి మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటించడమే కాకుండా బుల్లితెరపై బిజీయెస్ట్ యాంకర్ గా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉన్న యాంకర్లలో టాప్ యాంకర్ సుమ తర్వాత ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే అందరూ శ్రీముఖి పేరే చెబుతారు.
అయితే అలాంటి శ్రీముఖి త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అసలు విషయం ఏమిటంటే.గత కొద్ది రోజులుగా పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వస్తున్న శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.
ఇక వీరి పెళ్లి పెద్దలు కుదిర్చింది కాదట.ప్రేమ వివాహం అని తెలుస్తోంది.
శ్రీముఖి ( Sreemukhi Love ) గత కొద్ది రోజులుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని,అయితే ఈ విషయం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో పెళ్లికి ఇంకా లేట్ చేయడం అంత మంచిది కాదు అని శ్రీముఖి తండ్రి అనడంతో శ్రీముఖి కూడా పెళ్లి( Sreemukhi Marriage ) చేసుకోవాలని నిర్ణయించుకుందట.అయితే చాలా రోజుల నుండి పెళ్లి వార్తలు దాటేస్తూ వస్తున్న శ్రీముఖి ఈ విషయం తెలియడంతోనే చాలామంది సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ చేస్తూ ఇన్ని రోజులు పెళ్లి లేదు ఏం లేదు అనుకుంటూ చెప్పి ప్రియమైన వాడితో పెళ్లి పీటలెక్కబోతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి శ్రీముఖి పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే.