ఆ డ్రెస్ లో అలా తయారైన శ్రీముఖి.. బాగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

Anchor Sreemukhi Glamor Show In Modern Dress Netizens Trolling Details, Anchor Sreemukhi , Sreemukhi Glamor Show , Sreemukhi Modern Dress , Sreemukhi Trolled, Bigg Boss Sreemukhi , Sreemukhi Movie Offers

అప్పుడప్పుడు సెలబ్రిటీలు తాము తయారయ్యే విధానంలో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.వాళ్ళు ట్రెండ్ అని నచ్చినట్లుగా తయారవుతూ ఉంటారు.

 Anchor Sreemukhi Glamor Show In Modern Dress Netizens Trolling Details, Anchor S-TeluguStop.com

అంతేకాకుండా కొత్త కొత్తగా వాళ్ళే ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు.ఇక ఆ ట్రెండ్ వాళ్లకు నచ్చినప్పటికీ కూడా చూసే వాళ్లకు అంతగా నచ్చవు.

దీంతో కొన్ని కొన్ని సార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.తాజాగా శ్రీముఖి కూడా అలాగే ఎదుర్కొంది.

ఇంతకు తను ఎలా తయారయ్యింది అంటే.

టాలీవుడ్ బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా నిలిచిన ముద్దుగుమ్మ శ్రీముఖి.

మొత్తానికి బుల్లితెరను ఓ రేంజ్ లో ఏలేస్తుంది.ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన ఈ బొద్దుగుమ్మనే కనిపిస్తుంది.

పైగా స్టార్ యాంకర్ లిస్టులలో ఈమె కూడా చేరిపోయింది.ఇక ఈ ముద్దుగుబ్బ బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తన అందంతో మాత్రం అందర్నీ మాయ చేసేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు అందాల విందు వడ్డిస్తుంది.

ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో అడుగుపెట్టగా ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

ప్రతి షోలో ఈమె మాటలు, ఈమె డాన్సులు, సందడిలు వేరే లెవెల్ లో ఉంటాయి.తీరిక లేకుండా అదే పనిగా షో లలో చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమె ఎనర్జీ కోల్పోలేదని చెప్పవచ్చు.

ఇక ఈ బుల్లితెర ద్వారానే ఆమె వెండితెరపై కూడా అడుగు పెట్టింది.పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా చేయగా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.ఇక అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కూడా ఇంటర్వ్యూ చేస్తూ బాగా సందడి చేస్తుంది.బుల్లితెరపై కూడా పండుగల సమయంలో వచ్చే ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.

అలా ఈమెకు బుల్లితెర ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా వచ్చింది.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ని పలకరిస్తూ ఉంటుంది.

ఇక మొదట్లో పద్ధతిగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు గ్లామర్ షో చేయటానికి అస్సలు వెనకాడటం లేదు.ఎందుకంటే తనకంటే వెనకాల వచ్చిన యాంకర్లు బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోవడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా తను కూడా గ్లామర్ షో చేయడానికి ముందుకు వస్తుంది.

ఇప్పటికే బాగా ఎక్స్పోజ్ చేసింది శ్రీముఖి. సమయం దొరికినప్పుడల్లా బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన ఫాలోవర్స్ ను బాగా రెచ్చగొడుతుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.డాన్స్ వీడియోలను, ఫన్నీ రీల్స్ ను చేస్తూ షేర్ చేస్తుంది.ఇక కేవలం గ్లామర్ షోనే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు ట్రెండ్ అంటూ కాస్త కొత్తగా రెడీ అవుతూ ఉంటుంది.

మామూలుగా చాలామంది నగలు చీరలో ట్రెడిషనల్ డ్రెస్ లో వేసుకుంటూ ఉంటారు.కానీ శ్రీముఖి అలా కాకుండా డిఫరెంట్ గా మోడరన్ డ్రెస్ లో నగలు వేసుకుని కనిపించింది.

ఇక ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ డ్రెస్ లో ఎవరైనా నగలు వేసుకుంటారా అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube