తెలంగాణ బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.బడ్జెట్ లెక్కలు కేవలం ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని భట్టి తెలిపారు.ఇళ్ల స్థలాల గురించి కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదన్నారు.
బలహీన వర్గాలకు చాలా తక్కువ కేటాయింపులు చేశారని మండిపడ్డారు.లిక్కర్ అంశంలో తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగ భృతిపై కూడా బడ్జెట్ ప్రస్తావించలేదు.రాష్ట్ర ప్రజలకు అవసరమైన నిధులు, నీళ్లు, నియామకాలతో పాటు ఆత్మగౌరవం వంటివి బడ్జెట్ లో లేవని వెల్లడించారు.
సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు.ప్రతి రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిధులు కేటాయించలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మంత్రి హరీశ్ రావు అంకెల గారడీ మాత్రమేనని వెల్లడించారు.