మందు బాటిల్ ధర 8 వేలు... శివ జ్యోతి భర్త చాలా కాస్ట్లీ గురూ?

శివ జ్యోతి( Shiva Jyothi ) పరిచయం అవసరం లేని పేరు ఈమె తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే వార్తల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఇలా బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి శివ జ్యోతి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Anchor Shiva Jyothi Latest Instagram Video Goes Viral Details, Shiva Jyothi, Gan-TeluguStop.com

బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత బిజీ అవుతూ వచ్చారు.ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.

ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.ఇలా యూట్యూబ్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తే శివజ్యోతి తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ వీడియోని షేర్ చేశారు.

ఇందులో భాగంగా ఈమె నైట్ టైమ్స్ తన స్కిన్ కి సంబంధించిన కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నారు అయితే ఆ ఆర్డర్ రావడంతో వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి తన భర్త గంగూలి( Ganguly ) వస్తారు.ఏంటి ఇవి అని అడగడంతో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటూ ఈమె చెప్పగా ఎంత అని అడగగా ఒకటి రెండు వేలు మరొకటి 1800 అంటూ ఆమె సమాధానం చెబుతుంది ఇలా నైట్ రొటీన్ కోసం( Night Routine ) వేళ్ళల్లో ఖర్చు చేయడం అవసరమా అంటూ తన భర్త మాట్లాడతారు.

ఇలా స్కిన్ కేర్ కోసం వేళల్లో ఖర్చు చేయడం దేనికి అంటూ గంగూలి మాట్లాడటంతో వెంటనే శివజ్యోతి అవునా నిజమేనా మరి నీ నైట్ రొటీన్ ఏంటో నీకు చూపిన అంటూ ఈమె పక్కనే ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు అయితే అందులో పెద్ద ఎత్తున మందు బాటిల్స్ కనిపించడం విశేషం.అందులో ఒక్కో బాటిల్ ఎనిమిది వేల రూపాయలు నాలుగువేల రూపాయలు ఇలా ధర ఉండడంతో వాటన్నింటినీ శివ జ్యోతి బయట పెడుతూ ఉంటారు.

ఇలా తన భర్తకు సంబంధించిన అన్ని విషయాలు ఈమె చెప్పడంతో సరే సరేలే కావలసి వస్తే ఇంకా రెండు ఆర్డర్ చేసుకో అంటూ చెబుతారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మగజాతి ఆణిముత్యం మీరు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మీరు చాలా కాస్ట్లీ గురు అంటూ కామెంట్లో చేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube