బుల్లితెర యాంకర్ రవి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో షోల్లో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతే కాకుండా పలు సినిమాలలో కూడా నటించాడు రవి.ఇక ప్రస్తుతం బుల్లితెరలో పలు షోలలో బాగా బిజీగా ఉన్నాడు.బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని బాగా హైలెట్ గా నిలిచాడు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు రవి.ఇక ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
మొదట్లో యాంకర్ రవి తన ఫ్యామిలీని ఎవరికీ పరిచయం చేయలేదు.
ఇక కొంతకాలం నుంచి తన ఫ్యామిలీని పరిచయం చేయడమే కాకుండా వారిని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేశాడు.ఇక ఆయనకు వియా అనే కూతురు కూడా ఉంది.
ఇక తన కూతురుతో ఆడుతూ, పాడుతూ, అల్లరి చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా పంచుకుంటాడు.
లాక్ డౌన్ సమయంలో షూటింగులు లేక ఇంట్లో ఉంటూ ఇంట్లో పని చేస్తూ, వంట చేస్తున్న వీడియోలను షేర్ చేయగా అవి బాగా క్లిక్ అయ్యాయి.
ఇక ఈ మధ్య తన కూతురు వియా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.అంతేకాకుండా తనకు సపరేట్ సోషల్ మీడియా ఖాతా, యూట్యూబ్ లో ప్రిన్సెస్ వియా ఛానల్ క్రియేట్ చేశాడు రవి.ఇక అందులో తన మాటలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది వియా.

సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా నెటిజన్లతో ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు తన మాటలతో సమాధానాలు బాగా సందడి చేస్తుంది.గతంలో రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వియా హౌస్ లోకి వచ్చి ఎంత ముద్దుగా మాట్లాడిందో చూశాం.
నిజానికి ఆ ఎపిసోడ్ బాగా క్లిక్ అయింది.ఇక నిత్యం రవి తన కూతురు కి సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా పంచుకుంటూ ఉంటాడు.

తనతో చిన్నచిన్న వీడియోలను చేస్తూ బాగా ఆకట్టుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా కారు మీద ఎక్కి తన ముద్దు మాటలతో బాగా ఆకట్టుకుంది వియా.రవి తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో ని షేర్ చేసుకున్నాడు.అందులో వియా కారు మీద కూర్చొని సండే.ఫన్ డే.ఎలిమినేషన్ డే అంటూ తన ముద్దు ముద్దు మాటలతో బాగా మాట్లాడింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో రవి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.అంతేకాకుండా వియా మాటలకు ఫిదా అవుతున్నారు.ఇక రవి ప్రస్తుతం ఓ టి టి బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే.పైగా బుల్లితెరపై కూడా పలు షో లలో బిజీగా ఉన్నాడు.







