డైరెక్టర్స్ కోసం వెయిట్ చేయకు..సొంతగా సినిమాలు చేసుకోమన్న నెటిజెన్ కు ..రష్మీ.. హైలైట్ కౌంటర్.  

Anchor Rashmi Gives Strong Counter To Netizen About Her Director-

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి..

Anchor Rashmi Gives Strong Counter To Netizen About Her Director--Anchor Rashmi Gives Strong Counter To Netizen About Her Director-

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.

యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

ఒకప్పుడు ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తన ఎక్స్ ఫోజింగ్, ముద్దు సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మి తాజా మూవీ ‘అంతకు మించి’ లో మరింత డోస్ పెంచింది.ఈ చిత్రానికి సంబంధించి రష్మి హాట్ అండ్ సెక్సీ లుక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మి థైస్(తొడలు) తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా రష్మీ అభిమానులతో ట్విట్టర్ వేదికపై ముచ్చటించింది.ఉచిత సలహా ఇచ్చిన నెటిజన్ కి రష్మీ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

‘రష్మీ నువ్వు సొంతంగా సినిమాలు చేసుకో.దర్శకుల నుండి వచ్చే అవకాశాల కోసం వేచిఉండకు’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేయగా.

దీనిపై రష్మీ స్పందిస్తూ.‘‘తప్పకుండా చేస్తా.నా బ్యాంకు ఖాతా డీటెయిల్స్ నీకు పంపుతా.

3 కోట్లు పంపు.గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావ్’’ అని రిప్లై ఇచ్చింది.