బుల్లితెర యాంకర్ రష్మీకి మూగజీవాలంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే.తన గురించి వైరల్ అయ్యే వార్తలపై కూడా స్పందించడానికి ఇష్టపడని రష్మీ మూగజీవాలకు ఆపద కలిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు.
మూగజీవాల కోసం తన సంపాదనలో కొంతమొత్తాన్ని రష్మీ ఖర్చు చేస్తారు.జంతువులకు హాని కలిగే పరిస్థితులు ఉంటే ముందుగానే రష్మీ తగిన సూచనలు చేస్తూ ఉంటారు.
మరో రెండు రోజుల్లో హోళీ పండుగ ఉంది.
హోళీ పండుగ రోజున జంతువులకు హాని కలిగే విధంగా ఆచారాలను పాటించవద్దని రష్మీ తెలిపారు.
మతాలు, పండుగల సమయంలో రష్మీ చేసిన పోస్ట్ లలో కొన్ని వివాదాస్పదమైనా జంతువులకు మేలు జరుగుతుందనే ఆలోచన వల్ల రష్మీ మాత్రం కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గరు.హోళీ పండుగ కొరకు వాడే రంగులలో కెమికల్స్ ఉంటాయని పండుగ వల్ల రోడ్లు కూడా రంగులమయం అవుతాయని ఆమె అన్నారు.
హోళీ రంగులు మనుషులపై మనుషులు చల్లుకోవచ్చని అయితే వీధికుక్కలపై రంగులు చల్లడం మాత్రం సరికాదని ఆమె వెల్లడించారు.

హోళీ పండుగ రంగులలో ఉండే కెమికల్స్ వల్ల జంతువులకు హాని కలిగే అవకాశం అయితే ఉంటుందని తాత్కాలిక సంతోషం కొరకు జంతువుల ప్రాణాలకు అపాయం కలిగించడం మంచిది కాదని రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

మూగజీవాలను మనమే జాగ్రత్తగా చూసుకోవాలని వాటికి నోరు లేదని రష్మీ గౌతమ్ వెల్లడించారు.హిందూ మతం అంటే జాలి చూపించడం, దయతో మెలగడం అని జంతువులకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.రష్మీ చేసిన పోస్ట్ కు కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేస్తున్నారు.మరోవైపు రష్మీ చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.







