ఆ కంటెస్టెంట్ గుట్టు బయటపెట్టిన లాస్య?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి నిన్న యాంకర్ లాస్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

లాస్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ, ఫ్యాన్ బేస్ బాగానే ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేట్ కావడం గమనార్హం.

అయితే మిగతా కంటెస్టెంట్లు ఎలిమినేషన్ సమయంలో ఏడుస్తూ బయటకు వస్తే లాస్య మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చింది.దీంతో లాస్యకు కూడా హౌస్ లో ఉండటం ఇష్టం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

హౌస్ లో అగ్రెసివ్ గా ఉండకపోవడం, కిచెన్ కే ఎక్కువగా పరిమితం కావడం లాస్యకు మైనాస్ గా మారిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లాస్య హౌస్ లో ఎక్కువ సమయం నవ్వుతూ ఉండటం కూడా ఆమెకు మైనస్ గా మారిందని కొందరు ఆమె స్మైల్ ను కన్నింగ్ స్మైల్ అని చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో లాస్య ఇమేజ్ డ్యామేజ్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు.

ఇంటి సభ్యుల ప్రవర్తన, సేఫ్ గేమ్ ఆడుతున్నావనే కామెంట్లు సైతం ఆమెకు చిరాకు తెప్పించాయని సమాచారం.

Advertisement

అయితే లాస్య ఎలిమినేట్ అయిన తరువాత కంటెస్టెంట్ సోహెల్ గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పారు.సోహెల్ కు ముక్కు మీదే కోపంతో పాటు నరాలు ఉంటాయని బిగ్ బాస్ హౌస్ లో ఏ గొడవలు జరగకపోతే అక్కా గొడవ పెట్టుకుందామా అని తనతో చెబుతాడని అన్నారు.సోహెల్ కు కోపం ఎక్కువని అయితే అదే సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా సొహైల్ కు సాధ్యమవుతుందని తెలిపారు.

అయితే సోహెల్ కోపాన్ని చూసిన ఏదో జరగబోతుందని టెన్షన్ పుడుతుందని కామెంట్ చేశారు.ఆ మాటలు విన్న సోహెల్ తనకు మనస్సులో వీక్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ ఉండేదని లాస్య మాటలు విన్న తరువాత ఆ ఫీలింగ్ పోయిందని చెప్పారు.

అయితే లాస్య ఎలిమినేట్ అయిన తరువాత కూడా ఇతర కంటెస్టెంట్లపై నెగిటివ్ గా కామెంట్లు చేయకపోవడం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు