అనసూయ ఆంటీ కాదు బ్యూటీ.. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసిన యాంకర్!

తెలుగు లో హాట్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే గ్లామర్ బ్యూటీ అనసూయ. గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంటుంది.

 Anchor Anasuya Shared Photos Without Makeup Viral Pics Details, Anasuya, Anasuya-TeluguStop.com

అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ ను ఇంకా రెట్టింపు చేసుకుంది.ఇక లేటు వయసులో కూడా తన హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

ఇక అనసూయ మొదటిసారిగా వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.ఆ సమయంలో అనసూయ అంటే ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అందరి దృష్టి అనసూయ పై పడింది.జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.

ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.మెగా హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Anasuya, Anasuya Aunty, Anasuyalatest, Anasuya Pics, Anchor Anasuya-Movie

కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.ఓ వైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.

ఇక ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ.

ఇటీవలే అనసూయ జబర్దస్త్ నుండి దూరమైన సంగతి తెలిసిందే.ఇక ఆ షో నుంచి తప్పుకొని స్టార్ మా లో సెటిల్ అయింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.

బాగా ఫోటో షూట్ లు తీయించుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటుంది.

Telugu Anasuya, Anasuya Aunty, Anasuyalatest, Anasuya Pics, Anchor Anasuya-Movie

అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.ఇటీవలే చాలామంది ట్రోలర్స్ ఆమెను ఆంటీ ఆంటీ అంటూ బాగా టార్గెట్ చేశారు.

దీంతో వాళ్లకి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది అనసూయ.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ పై మరోసారి ట్రోల్స్ జరుగుతున్నాయి.

తాజాగా తను కొన్ని ఫోటోలు పంచుకోగా.అందులో తను మేకప్ లేకుండా కనిపించింది.

దీంతో అందరూ తనను కొందరు ఆంటీ అని ట్రోల్ చేస్తూ ఉండటంతో ఒక నెటిజన్ తను ఆంటీ ఎందుకు అవుతుంది.అసలు అనసూయ ఆంటీ కాదు బ్యూటీ అని కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube