అనసూయ కంటే ఆమె తల్లే అందంగా ఉంది.. ఫోటో చూశారా?

బుల్లితెర లేడీ యాంకర్లలో అనసూయకు ఉండే క్రేజే వేరు.పెళ్లై పిల్లలున్న ఈ యాంకర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

బుల్లితెరపై పలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తూనే వెండితెరపై విజయాలు సాధిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయకు గుర్తింపు మాత్రం జబర్దస్త్ షో ద్వారానే రావడం గమనార్హం.

లాక్ డౌన్ వల్ల ఇంటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమె మనస్సులోని భావాలను, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటోంది.

అయితే కొన్ని సందర్భాల్లో అనసూయ చేసిన పోస్టులు ట్రోల్ అవుతూ ఉంటాయి.ఎవరైనా తప్పుగా కామెంట్లు పెడితే వారికి అనసూయ కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.

Advertisement

తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది." ఐ లవ్ యూ మా.నీ పుట్టినరోజైన ఈరోజున నువ్వు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతమైన మనస్సుతో ఉండాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ తన తల్లితో దిగిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అనసూయ కంటే ఆమె తల్లే అందంగా ఉంది అని ఫన్నీగా కామెంట్లు పెడుతుండటం గమనార్హం.కొన్ని రోజుల క్రితం ఒక టీవీ షోలో పాల్గొన్న అనసూయ తన తల్లి బట్టలు కుట్టి కొత్త బట్టలు కొనిచ్చేదని.

తల్లి తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని.ఆమె ఎంతో కష్టపడి పెంచిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.అనసూయ తల్లి పేరు అనురాధ.

కొందరు నెటిజన్లు మాత్రం అనసూయ, అనురాధ తల్లీకూతుళ్లలా లేరని అక్కాచెల్లెళ్లలా ఉన్నారని కామెంట్లు చేయడం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు