ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.
ఇప్పటి వరకు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మాత్రమే తెరకెక్కుతున్నాయి.
అయితే మొదటిసారి ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా మాత్రం పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ పెరుగు తుంది.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ క్యూరియాసిటీ మరింత పెంచడానికి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్ ను రంగంలోకి దించుతున్నారట.

ఆయన మరెవరో కాదు.కేజిఎఫ్, విక్రమ్, ఖిలాడీ వంటి సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన బ్రదర్స్ అన్భరివ్ ఈ సినిమా కోసం కూడా పని చేయబోతున్నారని తెలుస్తుంది.
మరి డార్లింగ్ ప్రభాస్ కోసం ఎలాంటి ఫైట్స్ డిజైన్ చేస్తారో చూడాలి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.ఈమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన భాగం షూట్ కూడా స్టార్ట్ చేసింది.
అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది.ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.