బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ( Anasuya ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని పూర్తిగా సినిమాలకు అంకితమయ్యారు.ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకి కూడా గుడ్ బై చెప్పారు.
తాజాగా ఈమె ప్రేమ విమానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా కేరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని ఫోటోలను, సినిమా విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోని ఈమె తాజాగా పాత హీరోయిన్స్ మాదిరిగా ముస్తాబయి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలపై స్పందించినటువంటి ఒక నెటిజన్ కామెంట్స్ చేస్తూ.
చాలా అందంగా ఉన్నారు అచ్చం సావిత్రి (Savitri) గారి మాదిరిగానే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
మరొక నెటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ.ఎక్స్పోజింగ్ చేసిన అంత ఈజీ కాదు సావిత్రి గారిలా నటించడం అంటూ కామెంట్స్ చేశారు.ఇలా నేటిజన్స్ చేసినటువంటి ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ చాలా కరెక్ట్ గా చెప్పారండి.సావిత్రి గారిలా నటించడం ఎవరితరం కాదు.
నేను ట్రిబ్యూట్ ఇచ్చానంతే.అలాగే ఎక్స్‌పోజింగ్ ( Exposing ) చేయడం కూడా అంత తేలిక కాదు.
ఎక్స్పోజింగ్ చేయాలి అంటే శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి.ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.