ఎక్స్‌పోజింగ్ చేయడం అంత సులభం కాదు.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ( Anasuya ) ఒకరు.

ఈమె ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని పూర్తిగా సినిమాలకు అంకితమయ్యారు.

ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకి కూడా గుడ్ బై చెప్పారు.తాజాగా ఈమె ప్రేమ విమానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

"""/" / ఇలా కేరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని ఫోటోలను, సినిమా విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోని ఈమె తాజాగా పాత హీరోయిన్స్ మాదిరిగా ముస్తాబయి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫోటోలపై స్పందించినటువంటి ఒక నెటిజన్ కామెంట్స్ చేస్తూ.చాలా అందంగా ఉన్నారు అచ్చం సావిత్రి (Savitri) గారి మాదిరిగానే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.

"""/" / మరొక నెటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ.ఎక్స్పోజింగ్ చేసిన అంత ఈజీ కాదు సావిత్రి గారిలా నటించడం అంటూ కామెంట్స్ చేశారు.

ఇలా నేటిజన్స్ చేసినటువంటి ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ చాలా కరెక్ట్ గా చెప్పారండి.సావిత్రి గారిలా నటించడం ఎవరితరం కాదు.

నేను ట్రిబ్యూట్‌ ఇచ్చానంతే.అలాగే ఎక్స్‌పోజింగ్‌ ( Exposing ) చేయడం కూడా అంత తేలిక కాదు.

ఎక్స్పోజింగ్ చేయాలి అంటే శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్‌ అవ్వాలి.ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గర్ల్‌ఫ్రెండ్ ముందు హీరోలా కనిపించాలనుకుంటున్నారా.. ఈ “కిరాయి విలన్” మీకోసమే..