Anasuya : భర్త పై ఆసక్తికర పోస్ట్ చేసిన అనసూయ.. ఏకంగా దానితో పోల్చిన రంగమ్మత్త?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు రావడంతో వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

 Anasuya Latest Instagram Post On Husband Goes Viral-TeluguStop.com

దీంతో బుల్లితెర కార్యక్రమాలకు ఈమె దూరమయ్యారు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇక ఈమెకు షూటింగ్ పనులలో ఏమాత్రం విరామం దొరికిన తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారు.ఇక అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపే ఈమె తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్( Susank Bharadwaj ) ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

పోస్ట్ చూసినటువంటి అభిమానులు నీ భర్తను ఇలాంటి దానితో పోల్చడం ఏంటి అనసూయ.పోల్చడానికి మరేదీ లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ అనసూయ తన భర్తను ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే.ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె పోస్టులను చేస్తూ నాకు ఏ విధమైనటువంటి సహాయం అవసరం లేదని తెలిసినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాను ఇది సరిగ్గా తన భర్తకు సరిపోతుంది అంటూ ఒక చింపాంజీ( Chimpanzee ) ఉన్నటువంటి వీడియోని ఈమె షేర్ చేశారు.ఇలా చింపాంజితో తన భర్తను ఈమె పోల్చుకోవడంతో అభిమానులు నీ భర్తను పోల్చడానికి చింపాంజీ తప్ప మరేలాంటి వీడియోలు దొరకలేదా అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube