Anasuya Bharadwaj : నేను మారను… దానికి సిద్ధమే…అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో అనసూయ( Anasuya ) ఒకరు.ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Anasuya Bharadwaj : నేను మారను… దానికి స�-TeluguStop.com

ఇకపోతే ఇటీవల కాలంలో బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అనసూయ ఎన్నో విభిన్న పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Anasuya, Anchor, Glamours Role, Razakar, Tollywood, Vimanam-Movie

ఈమె ఇటీవల వచ్చినటువంటి విమానం ( Vimanam ) సినిమాలో ఒక వ్యక్తి పాత్రలో నటించారు.గతంలో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.ఇలా పాత్ర డిమాండ్ బట్టి ఈమె ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక త్వరలోనే రజాకార్ ( Razakar )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఎంతో ఘనంగా జరిగింది.

ఇకపోతే ఈ సినిమాలో కూడా అనసూయ విభిన్న పాత్రలో నటించబోతున్నారని ఈ సినిమాలో ఎలాంటి గ్లామర్ కి తావు లేకుండా ఈమె పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

Telugu Anasuya, Anchor, Glamours Role, Razakar, Tollywood, Vimanam-Movie

ఈ విధంగా అనసూయకు ఈ సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇకపై అనసూయ గ్లామర్ పాత్రలకు( Glamour Role ) దూరంగా ఉంటారా స్పెషల్ సాంగ్స్ కూడా చేయరా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నలకు ఈమె సమాధానం చెబుతూ నేను ఒక ఎంటర్టైనర్ ని.నేను ఏమాత్రం మారలేదు నేను నా పాత్రలకు అనుగుణంగా సినిమాలలో నటిస్తూ ఉంటాను పాత్ర నచ్చితే గ్లామర్ షో చేయడానికి అయినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube