వారే నా ఆర్మీ అంటూ అనసూయ పోస్ట్.. నెట్టింట్లో వైరల్!

యాంకర్ అనసూయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర యాంకర్ గా అనసూయ మనందరికీ సుపరిచితమే.

 Anasuya Bharadwaj About Her Fans And Fan Pages, Anasuya, Jabardasth, Fan Pages,-TeluguStop.com

యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై నటిగా కూడా తన సత్తాను చాటుతోంది.వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

అనసూయ కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.తనకూ తన సినిమాలకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనసూయ చేసే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇది ఇలా ఉంటే ఇటీవల మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హంగామాను క్రియేట్ చేసింది.

అనసూయ చేసిన ట్వీట్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ ని ఎదుర్కొంది.ఈ క్రమంలోనే నెటిజెన్స్ మరింత హద్దులు దాటుతూ అనసూయపై, జబర్దస్త్ షో ఫై కూడా దుమ్మెత్తి పోశారు.

కానీ అనసూయ మాత్రం అవేవీ పట్టించు కోకుండా ఆమె చేసిన ట్వీట్ కి పాజిటివ్ గా వచ్చిన కామెంట్లను షేర్ చేస్తూ వచ్చింది.

Telugu Anasuya, Fan Pages, Jabardasth-Movie

తన వాళ్ళు కానీ అర్థం చేసుకున్నారు అంటూ తాను చేసేది కరెక్టే అని అనిపిస్తోంది అంటూ కొందరు చేసిన కామెంట్లు షేర్ చేసింది అనసూయ.ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన ఫ్యాన్స్ గురించి, ఫాన్స్ పేజీల గురించి చెప్పుకొచ్చింది.అనసూయ పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని వేల ఖాతాలు ఉంటాయి.

అనసూయపై పాజిటివ్ పోస్ట్ చేస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ కొన్ని వేల ఫ్యాన్ పేజీలు యాక్టివ్ లో ఉన్నాయి అంటూ వాటిపై అనసూయ తన ప్రేమను కురిపిస్తూ, ఆమె ఫ్యాన్ పోస్ట్  చేసిన  పేజీలు నడిపించే వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube