పెదాలకు సర్జరీ చేయించుకుందంటూ అనన్య నాగళ్లపై ట్రోల్స్.. అంత అవసరమా అంటూ?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు గ్లామర్ ని మరింత పెంచుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.వాటిలో ముఖ్యంగా సర్జరీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

 Ananya Nagalla Lips Surgery Details, Ananya Nagalla, Lips Surgery, Tollywood, So-TeluguStop.com

ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్ లు వారి అందాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలువురు హీరోయిన్స్ సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల కూడా సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.మరి అనన్య నాగళ్ల చేయించుకున్న ఆ బ్యూటీ సర్జరీ మరి ఏదో కాదు లిప్స్ సర్జరీ.

అనన్య నాగళ్ల పెదాలకు సర్జరీ జరిగింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించడంతోపాటు ఆ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.ఒక సినిమా ఫంక్షన్ లో అనన్య పెదాలను గమనించిన కొందరు, ఇంతకుముందు జరిగిన కొన్ని సినిమా ఫంక్షన్లలో కాస్త భిన్నంగా కనిపించడంతో వెంటనే నెటిజన్ లు పసిగట్టేశారు.

దీంతో గతంలో ఫంక్షన్ కి తాజాగా జరిగిన ఒక ఫంక్షన్ లో అనన్య లిప్స్ కి కంపేర్ చేస్తూ ఖచ్చితంగా ఆమెకు సర్జరీ చేయించుకుంది అంటూ డప్పు కొట్టి మరి ఆ న్యూస్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Telugu Ananya Nagalla, Ananyanagalla, Lips Surgery, Shaakuntalam, Tollywood, Vak

కాగా ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.ఈ వార్త వైరల్ అవ్వడంతో అనన్య పెదాల గురించి కథలు,కథలుగా చర్చించుకుంటున్నారు ఫాలోవర్స్.ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

అలాగే ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోలు పోషిస్తుందట.దీంతో పాటుగా పలు కేజీ ప్రాజెక్టులను కూడా నటిస్తోంది అని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube