జబర్దస్త్ షోపై కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్.. దరిద్రం అంటూ?

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.అలాంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పి కూడా ఒకరు.

అయితే కిరాక్ ఆర్పి తో పాటుగా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోలుగా, కమెడియన్లుగా వెండితెరపై రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు.అయితే వారు ఇప్పటివరకు మల్లెమాల గురించి కానీ జబర్దస్త్ షో గురించి గానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

కానీ నాగబాబు శిష్యుడిగా మారి ఏకంగా నాగబాబు పేరుని గుండెల పై పచ్చబొట్టుబడి పెంచుకున్న కిరాక్ ఆర్పి మాత్రం తాజాగా మల్లెమాలపై సంచలన కామెంట్స్ చేశారు.మల్లెమాల లాంటి నీచమైన ప్రొడక్షన్ హౌస్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు కిరాక్ ఆర్పి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పి మాట్లాడుతూ.నల్లమల అనేది ఒక పేరు మాత్రమే అది ఎవరికి దేవుడు కాదు.వాళ్ళు కేవలం వ్యాపారం చేస్తారు అంతే.

Advertisement

శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసేది వ్యాపారం మాత్రమే, నాగబాబు గారు చేసేది వ్యవహారం అంటూ షాపింగ్ కామెంట్స్ చేశాడు కిరాక్ పార్టీ.నాగబాబు గారు స్కిట్ చూడడమే కాకుండా ఆకలి వేస్తే అన్నం పెడతారు.

ఆరోగ్యం బాగాలేక పోతే అపోలో ఆసుపత్రిలో చేర్పిస్తారు.కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం అలా చేయరు.

కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు అని తెలిపారు కిరాక్ పార్టీ. అయితే నన్ను చాలామంది జబర్దస్త్ నుంచి వచ్చేసానని వెన్నుపోటు పొడిచానని నీ అంత వెధవ ఉండరు అని, అన్నం పెట్టిన చోటు నుంచే వచ్చేసావ్ అని చాలామంది అన్నారు.

అలాంటి వారికి ఇప్పుడు చెబుతున్నాను నాకు మల్లెమాల అంటే ఇష్టం ఉండదు.ఈటీవీ అంటే ఇష్టం ఉండదు జబర్దస్త్ అంటే ఇష్టం ఉండదు.ముఖ్యంగా శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కిరాక్ ఆర్పి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆ సంస్థ అలాంటిది అని నాకు మొదటి రోజే తెలిసి ఉంటే చేసే వాడిని కాదు.మల్లెమాల పెద్ద జైలు లాంటిది.జైలులో పెట్టే ఫుడ్డు కంటే అద్వానంగా ఫుడ్ పెడతారు.

Advertisement

చిప్పకూడా పెడతారు అన్నం కూరలు టిఫిన్లు అంత దారుణంగా ఉంటాయి అని తెలిపాడు కిరాక్ ఆర్పి.మల్లెమాల వాళ్లు పెట్టే అంత వరస్ట్ ఫుడ్ సినీ ఈ ప్రపంచంలో ఎక్కడా పెట్టరు.

ఇదే మాట జబర్దస్త్ నుంచి వచ్చిన వారిని ఎవరైనా వాళ్ళ అమ్మానాన్న బిడ్డలపై ప్రమాణం చేసి నిజం చెప్పమనండి అక్కడ భోజనం ఎంత దారుణంగా పెడతారు తెలుస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరాక్ ఆర్పి.ఇంకా ఈ వాక్యాలపై స్పందించిన నెటిజెన్లు కిరాక్ ఆర్పి పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఇప్పుడు నీకు పేరు వచ్చింది అని జబర్దస్త్ సోని తప్పులు పడుతున్నావా, నాలుగు డబ్బులు చేతికి వచ్చేసరికి తిండింటివాసాలు లెక్క పెడతావా అంటూ చురకలు అంటిస్తున్నారు.

తాజా వార్తలు