ప్రస్తుత తరంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరిలో ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) భిన్నం.ఆయన తరచూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్నో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంటారు.
అందులో దేశప్రగతి, టెక్నాలజీ, సామాజిక బాధ్యత, ఎమోషనల్ వీడియోలు ఇలా ఎన్నో ఉంటాయి.తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.
నెటిజన్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు.ఆ వీడియోను పరిశీలిస్తే ఓ వ్యక్తి ట్రక్కు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటాడు.
అయితే అతడికి యాక్సిడెంట్ అవుతుంది.
దీంతో డ్రైవింగ్‌కి వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఆ సమయంలో భార్య వచ్చి ఫీజు కట్టాలను భర్తకు గుర్తు చేస్తుంది.అయితే తాను నడవలేని పరిస్థితిలో ఉంటే ఫీజు ఎలా చెల్లించాలని భార్యతో ఆ డ్రైవర్ అంటాడు.
భర్త నిస్సహాయ పరిస్థితిని గమనించిన ఆ భార్య ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది.తాను డ్రైవర్‌గా చేస్తానని తన భర్తతో ఆమె చెబుతుంది.
ఇంటి బాధ్యతలన్నింటినీ తాను మోస్తానని ముందుకు వచ్చింది.
చాలా నమ్మకంగా ముందడుగు వేసిన ఆ భార్యకు భర్త అండగా నిలుస్తాడు.అతడు లారీ క్యాబిన్‌లో పడుకుంటే ఆమె ధైర్యంగా ట్రక్కును నడుపుతుంది.అలా భర్త పరిస్థితి చూసి కుటుంబ బాధ్యతలను ఆమె తీసుకుంటుంది.
కొన్నాళ్లకు వారికి పరిస్థితి మారుతుంది.అప్పులన్నీ తీరి కొంచెం ఒడ్డున పడతారు.
యాక్సిడెంట్ అయిన తర్వాత మూలన పడ్డ ఆ భర్త క్రమంగా కోలుకుంటాడు.కొంచెం కొంచెం నడవడం ప్రారంభిస్తాడు.
ఇలా ఆ కుటుంబం ఒడ్డున పడే సమయంలో దీపావళి పండగ రానే వస్తుంది.
దీంతో కుమార్తె దీపకు ఆమె ఫోన్ చేస్తుంది.దీపావళి పండగకు ( Diwali )ఇంటికి తాను రాగానే అన్నీ చూసుకుంటానని ఆమె చెప్పింది.చివరికి వారు ఇంటికి రాగానే ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.
అది చూసి ఆ భర్త షాక్ తింటాడు.ఇలా వీడియో పూర్తవుతుంది.
చివర్లో ప్రతి గృహ లక్ష్మికి మహీంద్రా ట్రక్ అండ్ బస్ శుభాకాంక్షలు అని మెసేజ్ కనిపిస్తుంది.ఇది చూసిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రాను ప్రశంసిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య అనుబంధం, సమస్యలలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఒకరికొకరు ఎలా అండగా నిలవాలో అనే సందేశాన్ని ఈ వీడియో ఇస్తోందని నెటిజన్లు అభినందిస్తున్నారు.