ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య జంట గా కలిసి నటించిన సినిమా బేబీ( Baby Movie ) ఈ సినిమా మొదటి రోజు నుంచే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక దానికి తోడు ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని తెలుస్తుంది…పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ .7కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఊతకోత విధించింది.ఇక రెండవ రోజు కూడా అందులోనూ వీకెండ్స్ కావడంతో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది ఈ సినిమా.ఈ క్రమంలోనే రెండవ రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా రాబట్టిందో ఇప్పుడు చూద్దాం…

అసలు విషయంలోకెళితే ఎన్నో రోజులుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న ఆనంద దేవరకొండ( Anand Deverakonda ) ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి.దీంతో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతూ మరింత దూసుకుపోతోంది.ఇకపోతే బేబీ మూవీ కలెక్షన్స్( Baby Movie Collections ) విషయానికి వస్తే…
ఆంధ్ర ,తెలంగాణలో రెండవ రోజు కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ లభించినట్లు కలెక్షన్స్ లెక్కలు చూస్తే అర్థమవుతుంది.నైజాంలో రూ.1.35 కోట్లు, సీడెడ్ లో రూ.39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.48 లక్షలు, ఈస్ట్ గోదావరి లో రూ.20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.12 లక్షలు, గుంటూరులో రూ .17 లక్షలు, కృష్ణాలో రూ .17 లక్షలు, నెల్లూరులో రూ.10లక్షలు రాబట్టింది.ఇక మొత్తంగా కలుపుకుంటే రూ.2.98 కోట్ల షేర్ , రూ.5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం…

ఇక రెండు రోజులకు కలిపి ఈ సినిమా ఎంత కలెక్షన్స్( Baby Movie Two Days Collections ) వసూలు చేసింది అనే విషయానికి వస్తే.నైజాంలో రూ.2.55 కోట్లు, సీడెడ్ లో రూ.70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.90లక్షలు, ఈస్ట్ గోదావరి లో రూ.38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.23 లక్షలు, గుంటూరులో రూ .32 లక్షలు, కృష్ణాలో రూ .32 లక్షలు, నెల్లూరులో రూ.18లక్షలు రాబట్టింది.ఇక మొత్తంగా కలుపుకుంటే రూ.5.58 కోట్ల షేర్ , రూ.9.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం…అయితే మూడవ రోజు కూడా 5 .20 కోట్లు వసూలు చేసింది అనే టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని రాబట్టింది కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని ఆ చిత్ర యూనిట్ ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు….ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ విషయానికి వస్తే రూ.17.30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది…ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలక్షన్లను రాబడుతోంది చూడాలి…
.