టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.ఆనంద్ దేవరకొండ తెలుగులో దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలలో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదు.
కాగా ఆనంద్ దేవరకొండ కెరీర్ మొదట్లో నుంచి ఒక మంచి సక్సెస్ హిట్ సినిమాను కొట్టాలని చూస్తున్నాడు.మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తర్వాత పుష్పక విమానం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ ఆ సినిమా కూడా అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.
ఇకపోతే ఇప్పుడు నాలుగవ చిత్రం హైవే సినిమాతో అతను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది.
ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంతో హైప్ క్రియేట్ అయితే కానీ జనాలు థియేటర్లోకి రావడం లేదు.
ఇక ఎప్పుడో మొదలుపెట్టిన హైవే సినిమాము ఇప్పటివరకు కూడా అసలు షూటింగ్ జరుపుకుంటున్న విషయం కూడా ఎవరికీ తెలియదు.దీంతో రిస్క్ చేయడం ఎందుకని హైవే సినిమాను ఓటీటీ లోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది.

ఆనంద్ దేవరకొండ నటించిన హైవే సినిమా ఆగస్టు 19 న ఓటీటీ లో విడుదల కానుంది.అంటే లైగర్ సినిమా కంటే ఒక వారం ముందుగానే హైవే సినిమా ఓటీటీ లో విడుదల కాబోతోంది.కేవలం వారం గ్యాప్ తోనే అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మరి ఈ రెండు సినిమాలతో దేవరకొండ బ్రదర్స్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి మరి.ఇక ఆనంద్ దేవరకొండ లిస్టులో బేబీ గం గం గణేష్ అనే మరో సినిమాలు షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.కాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే.