తనకు వచ్చిన ఆదాయం లెక్కించిన పెద్దాయన.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో!

సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు నెటిజన్ల మనసులని దోచుకుంటూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.

మరికొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలా ఎమెషనల్ గా ఉందంటూ నెట్టింట జనాలు కామెంట్లు చేస్తున్నారు.

అవును, మ‌నిషి జీవితం అనేది ఓ సర్కస్ మాదిరి తయారయింది.భౌతిక విష‌యాల వెంట ప‌రుగుపెడుతూ మనిషి జీవితంలో సున్నిత పార్శ్వాన్ని విస్మ‌రిస్తున్నాడు.

త‌న‌కున్న వాటిని మ‌ర‌చి లేని వాటి కోసం వెంప‌ర్లాడుతూ వున్నాడు.ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది తమకున్న దాంతో తృప్తి చెందుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు.

Advertisement

ఇక్కడ ఎవడైతే ఉన్నదానితో తృప్తి చెందుతాడో వాడే నిజ‌మైన సంపన్నుడు అని ఓ మహానుభావుడు చెప్పాడు.అదే విషయాన్ని ఇక్కడ వీడియోలో కనిపించిన ఓ పెద్దాయన నిజం చేస్తున్నాడు.

ఓ పెద్దాయ‌న రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని లెక్కిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైర‌ల‌వుతూ ప‌లువురి హృద‌యాల‌ను మెలిపెడుతోంది.

ఈ వైర‌ల్ వీడియోను జింద‌గి గుల్జార్ హై అనే పేజ్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది.ఈ షార్ట్ క్లిప్‌లో ఆ రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని ఆ పెద్దాయన కౌంట్ చేయ‌డం క‌నిపిస్తుంది.ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయిన కొద్ది సేప‌టికే మూడు ల‌క్ష‌ల వ్యూస్‌కు చేరువైంది.

ఈ వీడియోను చూసిన త‌ర్వాత నెటిజ‌న్లు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నారు.నీకున్న‌దాంతో సంతోషంగా ఉండు అని ఒకరు కామెంట్ పెడితే… పెద్దాయన నీలాగా బతకడం మాకు చేతకావట్లేదేమి? అని ఒకరు, చిన్న గ‌ది, చిరు ఆదాయం ప‌ట్ల కృత‌జ్ఞ‌త చూపించు అని మరొకరు.వీడియో హృద‌యాన్ని తాకింది, జీవితం అందరికీ ఒకేలా ఉండదు అని ఇంకొక యూజ‌ర్ కామెంట్ చేశారు.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు