33 ఏళ్లకే లండన్ జాబ్ వదిలేసిన ఐఐటీయన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సాధారణంగా లండన్( London ) వంటి పెద్ద సిటీలలోని కంపెనీలలో మంచి జాబు వస్తే జన్మ ధన్యమవుతుందని చాలామంది భావిస్తారు.

కానీ కొంతమంది మాత్రం ఇలాంటి మంచి జాబులను తృణపాయంగా వదిలేస్తారు.

జీవితంలో ముఖ్యమైన వేరే కలలను సహకారం చేసుకునేందుకు వీరి ఇలా చేస్తారు.తాజాగా IIT-ఢిల్లీ మాజీ విద్యార్థి( Ex-student of IIT-Delhi ) కూడా అదే పని చేశాడు.33 ఏళ్లకే జాబు వదిలేసి ఇండియాలో ఎర్లీగా రిటైర్ కావాలని అతను డిసైడ్ అయ్యాడు.రెడిట్‌లో రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన కవితను పోస్ట్ చేశాడు.

జీవితంలో భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నానని, అది తనకు సర్వస్వం మార్చిందని కవితలో చెప్పాడు.అలాగే 33 ఏళ్లకే ఎందుకు రిటైర్ అయ్యానో వివరించాడు.

లండన్‌లో ఉద్యోగం వదిలేసి ఇండియాకు రావడానికి కొన్ని కారణాలను కూడా చెప్పాడు.

Advertisement

ఆ వ్యక్తి నాలుగేళ్లపాటు బ్యాంకులో గణిత నిపుణుడిగా పనిచేశాడని రెడిట్‌ పోస్ట్( Reddit post ) పేర్కొంది.ఆ తర్వాత లండన్‌లోని మరో బ్యాంకులో ఐదేళ్లు పనిచేశాడు.ఆ తర్వాత లండన్‌లోని ఓ టెక్ కంపెనీలో రెండేళ్లు పనిచేశాడు.

అతను రెడిట్‌లో “2023లో నేను భారతదేశానికి తిరిగి వచ్చాను.నేను ఏటా రూ.2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించగలనని గ్రహించాను.అలానే ఇండియాలో జీవించడం చౌక అని కూడా తెలుసుకున్నా.

కాబట్టి నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి, మీనింగ్ ఫుల్ స్టార్ట్ చేద్దామనుకున్నాను." అని పేర్కొన్నాడు.11 ఏళ్ల కెరీర్‌లో చాలా డబ్బు సంపాదించానని చెప్పాడు.అతను 2013లో 35 లక్షల రూపాయలతో ప్రారంభించి 2023లో 35 లక్షల పౌండ్లు వెనకేశాడు.

అతను ముందుగానే రిటైర్ అయ్యాడు, తన బడ్జెట్‌ను ప్లాన్ చేశాడు.అతను ఇలా అన్నాడు, “నేను పేరెంట్స్‌తో కొంతకాలం ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా, ఎందుకంటే నేను వారిని చాలా మిస్ అయ్యా.నేను వారితో 15 ఏళ్లు దూరంగా ఉన్నాను.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

దీంతో నా ఖర్చులు చాలా తగ్గాయి.నా ప్రధాన ఖర్చులు టాక్సీలు, బయట తినడం, జిమ్‌కి వెళ్లడం.

Advertisement

కొన్నిసార్లు నేను భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి లేదా కొత్త బట్టలు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తాను.ఆరోగ్యం, రిలేషన్‌షిప్స్‌, సంపద జీవితంలో చాలా ముఖ్యమైనవి అని, డబ్బు సంపాదించాను కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం, సంబంధాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నానని వివరించాడు.

భవిష్యత్తులో తాను ఏమి చేయాలనుకుంటున్నాడో కూడా చెప్పాడు.ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని తాను ఆలోచిస్తున్నట్లు చెప్పాడు.

అలానే 1000 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని కోరుకున్నాడు.అతని పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు