Foxconn Project X Car: ఇండియన్ మార్కెట్లోకి ఒకే వరుసలో 3 సీట్లు వుండే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్లోకి ఒకదాని తరువాత ఒకటిగా ఎలక్ట్రానిక్ కార్లు వచ్చి చేరుతున్నాయి.

ఈ క్రమంలో ఒకే వరుసలో 3 సీట్లు కలిగిన ఓ ఎలెక్ట్రిక్ వెహికల్ ని తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ప్రవేశ పెట్టింది.

ఈ విషయమై తాజాగా విద్యుత్‌ వాహన కన్సార్షియం, MIH మొదటి కారును 2023లో తీసుకురానున్నట్లు తెలిపారు.ఒకే వరుసలో 3 సీట్లు ఉండే కారును ఫాక్స్‌కాన్‌ బృందం రూపొందించింది.

ఈ కారుకు ‘ప్రాజెక్ట్‌ ఎక్స్‌’ అని పేరు పెట్టడం కొసమెరుపు.ఒకే వరుసలో 3 సీట్లు వుండడం అంటే అదేదో పెద్ద వెహికల్ అని పొరపాటు పడకండి.

ఆసియా దేశాల్లో ఒక సంతానం ఉండే కుటుంబాలకు సరిపోయేలా, అంటే చిన్న కుటుంబాల కోసం ఈ కారును తీసుకు రానుంది.కొనుగోలుదారు తనకు నచ్చే విధంగా ప్రాజెక్ట్‌ ఎక్స్‌తో వాహనాన్ని రూపొందించుకోవచ్చని MIH చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్‌ చెంగ్‌ తెలిపారు.ఇక ఈ కారు ధర అక్షరాలా 20,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16.5 లక్షలు అన్నమాట.

Advertisement

ఈ కారును తైవాన్‌తో పాటు భారత్‌, ఇండొనేషియా, ధాయ్‌లాండ్‌, జపాన్‌ వంటి దేశాల్లో విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.కరోనా కష్టకాలం తరువాత ఆయిల్స్ రేట్స్ భగ్గుమంటున్న తరుణంలో విద్యుత్ వాహనాలు మనిషికి ప్రత్యామ్నాయంగా మారాయి.దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ కంపెనీలు వాహనాలను రూపొందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే గత కొన్నేళ్లలో విద్యుత్‌ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీపై ఫాక్స్‌కాన్‌ పెట్టుబడులు పెంచుతోంది.ఇప్పటికే అమెరికా సంస్థ ఫిస్కెర్‌ ఇంక్‌, భారత సంస్థ వేదాంతాలతో ఒప్పందాలు ప్రకటించడం కొసమెరుపు.

మరెందుకాలస్యం ఇంటరెస్ట్ వున్నవారు ఇప్పుడే ఆర్డర్ చేయండి.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు