చుండ్రు ఎంతకీ పోవడం లేదా? అయితే ఒక్క వాష్ లోనే ఇలా వదిలించుకోండి!

చుండ్రు అనేది కోట్లాది మందిని చాలా కామన్ గా వేధించే సమస్య.అయితే అందరిలోనూ చుండ్రుకు కారణాలు ఒకేలా ఉండవు.

ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం చేత చుండ్రు మదన పెడుతుంటుంది.అయితే కొందరిలో చుండ్రు( Dandruff ) ఎంతకీ పోదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఖరీదైన నూనె షాంపూలను వాడిన చుండ్రు మాత్రం తగ్గదు.దాంతో ఏం చేయాలో తెలీక పిచ్చెక్కిపోతుంటారు.

అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఒక్క వాష్ లోనే చుండ్రు ను వదిలించుకోవచ్చు.

Advertisement
An Effective Remedy To Prevent Dandruff Is For You!,Home Remedy, Latest News, Ha

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

An Effective Remedy To Prevent Dandruff Is For You,home Remedy, Latest News, Ha

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి వాటర్ పోసి ఐదు గంట పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వగానే నాలుగు రెబ్బల కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి.

అలాగే నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.

An Effective Remedy To Prevent Dandruff Is For You,home Remedy, Latest News, Ha

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మెంతులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో అర కప్పు పెరుగు మరియు అర కప్పు తయారు చేసుకున్న నూనెను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Advertisement

చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీని పాటిస్తే ఒక్క దెబ్బకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.చుండ్రును సమర్థవంతంగా నివారించడానికి ఈ రెమెడీ చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు మళ్ళీ మళ్ళీ వేధించకుండా సైతం ఉంటుంది.

తాజా వార్తలు