చాలాకాలంనుండి వస్తున్న వార్తే ఇది.ఏదో ఒక గ్రహ శకలం(Asteroid) అనేది భూమికి అతి సమీపంగా వస్తుందనేది.
అయితే తాజాగా 2046లో భూమిని (Earth) అది సరాసరి తాకనుందని కొత్త కొత్త కధనాలు వెలువడుతున్నాయి.అయితే ఇందులో వాస్తవమెంత? అది కూడా ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ సైజులో ఉన్న ఈ గ్రహ శకలం సరిగ్గా 2046 వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చని అంచనా వేయడం కాస్త కామెడీగా అనిపిస్తోంది కదూ.కాగా ఇక్కడ దీని ప్రభావం మాత్రం అంతగా ఉండబోదని నాసా (NASA) మంగళవారం ట్వీట్ చేయడం మరి కాస్త విడ్డురంగా అనిపిస్తోంది.

అవును, దీని విషయమై పరిశోధకులు మరింత డాటా సేకరిస్తున్నారు.కొత్త సమాచారం తెలుస్తున్న కొద్దీ అంచనాలు మారిపోవచ్చు కూడా.కాగా ఈ గ్రహ శకలాన్ని 2023 DWగా పిలుస్తున్నారు.
ఇది భూమిని ఢీకొనే అవకాశం 560 లో 1 గా ఉందని నాసా తెలిపింది.స్పేస్ రాక్(Space Rock) భూమిని తాకే అవకాశాలకు ఈ స్కేలు కొలప్రమాణం.
స్కేలుపై 0 వస్తే, భూమికి ఏ ముప్పూ లేదని అర్థం.స్కేలుపై 1 వస్తే భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువని అర్ధం.
అదేవిధంగా కంగారుపడాల్సి న అవసరం లేదని అర్ధం.నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది.

అయితే, 2023 డీడబ్ల్యూ దురదృష్టవశాత్తు భూమిపై ఏదైనా ప్రధాన నగరాన్ని లేదా జనాభా ఎక్కువ గల ప్రాంతాన్ని తాకితే ప్రమాదం సంభవించవచ్చని చెబుతున్నారు.అయితే, 2023 డీడబ్ల్యూ ఆస్టెరాయిడ్ భూమిని తాకకుండా పక్క నుంచి వెళ్లిపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇలా రకరకాల ఊహాగానాలు మాని… ఒకవేళ ప్రమాదం అనేది సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది చూడమని చెబుతున్నారు.







