ఎమీ జాక్సన్‌ నోటి దూల

సెలబ్రెటీలు ఏ చిన్న విషయంలో నోరు జారినా కూడా పెద్ద పెద్ద అర్థాలు వాటికి వస్తుంటాయి.తమ మనోభావాలను దెబ్బతీశారు అంటూ సెబ్రెటీలపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వస్తుంటాయి.

 Amy Jackson Comments On Jallikattu Ban-TeluguStop.com

తాజాగా ఎమీ జాక్సన్‌ ఈ ఆగ్రహ జ్వాలలకు మాడి పోతుంది.ఆ మధ్య తెలుగులో ‘ఎవడు’ సినిమాలో నటించి, ఆ తర్వాత ‘ఐ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘రోబో’ సీక్వెల్‌లో నటించే బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది.

ఈ సంతోషంలో ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యి, ఆమెపై తమిళనాడులో భారీ వ్యతిరేకత మొదలైంది.

వివాదం వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులో అతి ప్రాచీన కాలంగా వస్తున్న ఆట జల్లికట్టు.

ఈ ఆటపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది.తమిళనాడు జనాలు ఆ నిషేదంను ఎత్తి వేయాలి అంటూ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు.

కాని బాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం మూగ జీవాలను హింసించే జల్లి కట్టు ఆటపై నిషేదం కొనసాగించాల్సిందే అంటూ పట్టు పట్టుకుని ఉన్నారు.బాలీవుడ్‌ స్టార్స్‌తో ఎమీ జాక్సన్‌ సైతం జల్లికట్టుపై నిషేదం కొనసాగాల్సిందే అంటూ తాజాగా ప్రకటించింది.

దాంతో తమ భాషలో సినిమాల్లో నటిస్తూ, తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వక పోవడంపై ఎమీజాక్సన్‌పై వివాదం మొదలైంది.తాజాగా ఆమెను ‘రోబో’ సీక్వెల్‌లో దర్శకుడు శంకర్‌ ఎంపిక చేశాడు.

తమిళ ప్రేక్షకులు ఆ సినిమా నుండి ఎమీ జాక్సన్‌ను తొలగించాలని, లేని పక్షంలో సినిమాను ఆడనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు.ఎమీ జాక్సన్‌ నోటి దూల వల్ల ఇప్పుడు శంకర్‌ ఇబ్బందుల్లో పడ్డాడు.

మరి శంకర్‌ ఏం చేస్తాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube