అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి సినిమా క్లాస్‌గా ఉండాలా, మాస్‌గా ఉండాలా, ప్రేమ కథతో రావాలా, యాక్షన్ కథాంశంతో రావాలా అనే చర్చ భారీగా వచ్చింది.అఖిల్ అన్న చైతూ మొదటి సినిమా క్లాస్‌గా చేయడంతో ఫలితం తారు మారు అయ్యింది.
అందుకే అఖిల్ మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా చేయాలని నిర్ణయించుకుని చేసిన సినిమా ‘అఖిల్’.వినాయక్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.
మొదటి సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో అఖిల్ తీవ్రంగా నిరుత్సాహ పడ్డాడు.అంతే కాకుండా డిప్రెషన్‌కు కూడా లోనయినట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఇప్పుడిప్పుడే షాక్ నుండి తేరుకుంటున్న అఖిల్ తన తర్వాత సినిమాపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈసారి మాస్‌ను కాకుండా క్లాస్ ఆడియన్స్‌ను మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం ఒక మంచి లవ్ స్టోరీని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నాడు.ప్రస్తుతం అఖిల్ వద్దకు పలు ప్రేమ కథలు వస్తున్నాయి.
ఆ ప్రేమ కథలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో ఈయన రెండవ సినిమా ప్రేమ కథతో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా అఖిల్ రెండవ సినిమాపై సైతం అంచనాలు భారీగా ఉండే ఛాన్స్ ఉంది.అందుకే అఖిల్ ఆచి తూచి అడుగులు వేస్తే మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు.







