ప్రముఖ నటుడు రంగనాథ్ ఒంటరి తనం బరించలేక ఆత్మ హత్య చేసుకున్నాడు.గత కొంత కాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న రంగనాథ్ ఇటీవలే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు.
ఆ వేడుకలు కుటుంబం సమక్షంలో కాకుండా ఒక అనాధ ఆశ్రమంలో జరుపుకున్నాడు.ఈయన్ను కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోక పోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్న సైతం ఈయన మాత్రం ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నాడు.
గత కొన్ని రోజులుగా సినిమాలు లేక, ఒంటరిగా జీవితంను గడుపలేక తనువు చాలించినట్లుగా తెలుస్తోంది.
ఆయన తనకు అత్యంత సన్నిహితుడు అయిన ఒక మిత్రుడికి గుడ్ బై అంటూ మెసేజ్‌ను చేసి ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్న ఈయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించాడు.
ఈయన బుల్లి తెరపై కూడా పలు సీరియల్స్ మరియు కార్యక్రమాల్లో కనిపించాడు.రంగనాథ్ మరణంకు తెaుగు సినిమా పరిశ్రమ అంతా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
పaువురు స్టార్స్ రంగనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ ఆయన జ్ఞాపకాaను తలుచుకుంటున్నారు.రంగనాథ్‌కు తెలుగు స్టాప్ తరపున శ్రద్దాంజలి ఘటిస్తున్నాం.







