క్రియేటివిటీ మాములుగా లేదుగా.. మర్రిచెట్టులోనే టీ స్టాల్..?!

సోషల్ మీడియాలో చాలా క్రియేటివ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.కొంతమంది చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు.

 Amritsar Old Man Creative Business Idea Running Tea Stall In Banyan Tree Details-TeluguStop.com

వినూత్నంగా పనులు చేస్తూ పాపులర్ అవుతూ ఉంటారు.ఇటీవల సోషల్ మీడియాలో వెరైటీ ఫుడ్ ఐటమ్స్, కొత్త పరికరాలు తయారుచేస్తూ చాలామంది క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

అందులో భాగంగా తాజాగా మరో క్రియేటివ్ బిజినెస్ ఐడియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒక వృద్ధుడు మర్రిచెట్టులోనే టీ స్టాల్ ఏర్పాటు చేశాడు.గత కొంతకాలంగా ఈ టీ స్టాల్‌ను( Tea Stall ) నడుపుతున్నాడు.ఒక పెద్ద మర్రిచెట్టులో( Banyan Tree ) టీ స్టాల్ నడపడం అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ వృద్ధుడి బిజినెస్ ఐడియాకు అందరూ ఫిదా అవుతున్నారు.ఇక్కడ టీ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు.దీంతో ఈ టీ స్టాల్ ముందు కస్టమర్లు క్యూ కడుతున్నారు.దీంతో ఈ వృద్ధుడికి ఆదాయం కూడా బాగానే వస్తుంది.

దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) తన ట్విట్టర్ లో పంచుకున్నారు.ఈ సారి అమృత్ సర్‌కి వచ్చినప్పుడు గోల్డెన్ టెంఫుల్‌తో పాటు ఈ టీ స్టాల్‌ను తప్పకుండా సందర్శిస్తానంటూ తెలిపారు.

అమృత్ సర్‌లో చూడాల్సినవి చాలా ఉన్నాయని, టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్ ను తప్పక సందర్శిస్తానంటూ ఆనంద్ మహీంద్రా తెలిపారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో ఈ టీ స్టాల్ గురించి ఇప్పుడు చాలామందికి తెలిసింది.చెట్టు తొర్రలో ఈ టీ స్టాల్‌ను 60 ఏళ్ల వృద్ధుడు నడుపుతున్నాడు.గత 40 ఏళ్లుగా ఈ టీ స్టాల్ నడుపుతున్నాడు.ఇన్ని సంవత్సరాలుగా నడుపుతుండటంతో ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో పాపులర్ అయ్యారు.ఈ టీ స్టాల్‌ను ఒక దేవాలయంగా ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు.

వృద్ధుడి ఐడియాకు నెటిజన్లు హ్యాట్సఫ్ చెబుతున్నారు.ఈ బిజినెస్ ఐడియా చాలా క్రియేటివ్‌గా ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube