రామోజీరావు.ఈనాడు గ్రూప్ అధినేత.
ఏపీలో అందరూ ఆయన్ని రాజగురువు అంటారు తన తెలివితేటలతో ఏపీలో రాజకీయాలని కూర్చుని నడిపించగల సమర్ధుడు ఆయన.ఒక సాధారణ స్థాయి నుంచీ తన తెలివి తేటలతో ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించారు.అయితే రాజకీయాలు చెయడానికి రోడ్లపైకి వచ్చి మాత్రమె చేయక్కలేదు అని నిరూపించే ఏకైక వ్యక్తి.ఎన్టీఆర్ రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా చక్రం తిప్పారు రామోజీ .ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినది ఎన్టీఆర్ అయితే తెర వెనుక కధ నడిపించింది మాత్రం రామోజీనే.
కాలక్రమంలో రాజకీయాలలో భాగంగా చంద్రబాబుకి మద్దతు ఇచ్చిన రామోజీ అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా చంద్రబాబు కి పరోక్షంగా ఎంతో సాయం చేశారు.
ఇలా రాజకీయాలతో నేరుగా సంబంధం లేకపోయినా.రామోజీరావు మాత్రం తెరవెనుక నాయకులను, నేతలను నిర్దేశిస్తూనే ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ సీన్ లోకి బీజేపీ ఎంటర్ అయ్యింది…వాస్తవంగా కేంద్రంలో రామోజీ సపోర్ట్ ఎవరికీ ఉంటుంది అంటే తడుముకోకుండా చెప్పవచ్చు బీజేపీ కి అనిఅ.ఎందుకంటే వాజ్ పేయ్ హయాం నుంచీ ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది రామోజీ ఒక్కరే.ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వ పదకాలకి విస్తృతమైన ప్రచారం కల్పిస్తారు రామోజీ

అదేవిధంగా ఇప్పటికీ మోడీ కి మద్దతుగా రామోజీ నిలిచారు కూడా ఈ క్రమంలోనే కార్పొరేట్ సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవాలన్న మోడీ పిలుపుతో రామోజీ కదలి వచ్చారు.కృష్ణా జిల్లా గుడివాడలో తాను పుట్టిన ఊరును రామోజీ దత్తత తీసుకు డెవలప్ చేశారు.ఓడీఎఫ్ విషయంలోనూ రామోజీ ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు…ఇలా మోడీ ప్రభుత్వం తో సైతం రామోజీ మంచి సంభంధాలు నేరుపుతున్నారు.
ఇప్పటి వరకూ బాగానే ఉన్నా రామోజీ కి అసలు సంకట పరిస్థితి ఎదురవుతోంది.
వచ్చే ఎన్నికల్లో తన మీడియా ద్వారా బీజేపీకి ప్రచారం కల్పించాలనేది వీరి అభ్యర్థన.ఈ విషయంలోనే రామోజీ షా ల భేటీ జరిగిందని సుదీర్ఘ చర్చల అనంతరం షా రామోజీ మద్దతు కోరారని తెలుస్తోంది.
అయితే, చంద్రబాబుకు ఇప్పటి వరకు అండగా ఉంటూ వచ్చిన రామోజీకి.బీజేపీ అభ్యర్థనతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు విశ్లేషకులు…ఒక పక్క బిజేపీ మరో పక్క బాబు ఏమి చేయాలో ఎలా బ్యాలెన్స్ చేయాలో రామోజీకి పాలుపోవడం లేదట.
దాంతో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రామోజీ ఎదుర్కోలేదని అంటున్నారు విశ్లేషకులు.మరి రామోజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.







