ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య..కంటతడి పెట్టిస్తున్న లేఖ

ప్రతీ విద్యార్ధికి చదువు అవసరమే అయితే ఆ చదువు ముందుగా విద్యార్ధికి ఆత్మస్థైర్యాన్ని నింపాలి.సమాజంలో ఎలా బ్రతకాలో తెలపాలి అప్పుడు విద్యార్ధి ఎంతో ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తాడు.

 Vijayawada Inter Student Nithin Suicide Note Will Break Your Heart-TeluguStop.com

అయితే ఈ కార్పొరేట్‌ చదువులలో విద్యార్ధికి చదువుపై భయాన్ని నేర్పుతున్నాయి తప్ప ధైర్యాన్ని నిమ్పడంలేదు అందుకే వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి…విద్యార్ధి పై తీవ్రంగా తెస్తున్న వత్తిడి ఆ విద్యార్ధికి తీవ్రమైన నరకాన్ని చూపిస్తోంది తల్లి తండ్రులకి చెప్తే ఎక్కడ తిడుతారో ఎక్కడ భాద పడుతారో అనే ఆలోచనలో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.

ఇలాంటి సంఘటనే ఇప్పుడు విజయవాడలో జరిగింది.

తాజాగా చైతన్య కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్య కి పాలపడ్డాడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నితిన్ అనే విద్యార్ధి విజయవాడ గురునానక్ కాలనీ మయూరి క్యాంపస్ లో చదువుతున్నాడు హాస్టల్ రూమ్ లోని ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాలపడ్డాడు…అయితే నితిన్ చనిపోయే ముందు రాసిన లెటర్ అందరినీ కంట తడి పెట్టిస్తోంది.నాన్నా నన్ను క్షమించండి అమ్మ, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని అంటూ చివరి లేఖని తన తండ్రికి రాశాడు.ఈ లేఖ పలువురిని కంటతడి పెట్టించింది.

అయితే విద్యార్ధి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం అని తెలుస్తోంది.10 th క్లాసు లో మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్లో కూడా ప్రతిభ కనబరుస్తున్న ఆ విద్యార్ధి ఒక్క సారిగా ఇలాంటి ఆపని చేయడం తో అందరూ షాక్ కి గురయ్యారు.అయితే పోలీసులు మాత్రం ఆ విద్యార్ధి రోజంతా చదువుల్లో పడి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టర్ కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు…ఇకనైనా విద్యార్ధులపై కళాశాల యాజమాన్యాలు కానీ తల్లి తండ్రులు కానీ చదువులో ఒత్తిడి తీసుకురావద్దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube