ప్రభాస్ కల్కి మూవీలో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్.. యంగ్ లుక్ వేరే లెవెల్ అంటూ?

ప్రభాస్ నాగ్ అశ్విన్( Prabhas Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మే నెల 9వ తేదీన విడుదల కావాల్సి ఉన్నా ఏపీ ఎన్నికల వల్ల రిలీజ్ డేట్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ జూన్ 27 అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.భారతీయుడు2 మూవీ విడుదలైన రెండు వారాల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది.

 Kalki 2898ad Markers Reveal First Look Of Amitabh Details Here,amitabh Bachchan,-TeluguStop.com

గ్లింప్స్( Kalki 2898 AD Glimpse ) లో కొన్ని సెకన్ల పాటు అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ లో కనిపించడం అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

గ్లింప్స్ లో “ఎవరు నువ్వు నీకు మరణం అన్నదే లేదా? నువ్వు దేవుడివా? ఎవరు నువ్వు?” అని బాలుడు అడగగా “నేను ద్వాపర యుగం నుంచి ఉన్నాను, గురు ద్రోణాచార్యుడి పుత్రుడను అంటూ అమితాబ్ సమాధానం ఇస్తాడు.అశ్వత్థామ పాత్రలో అమితాబ్ లుక్( Amitabh Ashwatthama Look ) మాత్రం వేరే లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఈ సినిమా కోసం డీ ఏజింగ్ టెక్నాలజీని వాడారని ఆ టెక్నాలజీ సహాయంతో అమితాబ్ ను యంగ్ లుక్ లో చూపించారని సమాచారం అందుతోంది.

కొడుకు అభిషేక్ బచ్చన్ ను గుర్తు చేసేలా అమితాబ్ లుక్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు.

నాగ్ అశ్విన్ ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీ స్థాయిలో తెరకెక్కించారు.ఈ సినిమా ఎన్ని అంచనాలతో థియేటర్ కు వెళ్లినా ఫ్యాన్స్ ను నిరాశపరచని సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్వరలో రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇవ్వడంతో పాటు ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది.సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ప్రయత్నిస్తుండటం వల్ల మంచి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం సమస్యగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube