ఏపీలో సార్వత్రిక ఎన్నికల( General Elections in AP ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం చర్చనీయంశంగా మారింది.అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే తాము ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, టిడిపి , జనసేన పొత్తు( TDP and Jana Sena alliance ) పెట్టుకునే విధంగా ముందుకు వెళుతున్నాయి.
సీట్ల వ్యవహారం సర్దుబాటు అయిన తర్వాత అధికారికంగా ఈ పొత్తుల వ్యవహారాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.దీంతో పాటు, బిజెపి కూడా తమతో కలిసి వచ్చే విధంగా అటు టిడిపి, ఇటు జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తే వైసిపి కచ్చితంగా ఓటమి చెందుతుందనే అంచనాలో ఉన్నాయి.కొద్దిరోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.
అక్కడ కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( Union Home Minister and BJP National President JP Nadda ) తో దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.అయితే అక్కడ పొత్తుల అంశంపై పెద్దగా క్లారిటీ రాకపోవడంతో, మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించబోతుండడంతో , ఈ పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని, టిడిపి తో పొత్తు అంశాన్ని అమిత్ షా ఏపీ పర్యటనలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అమిత్ షా రేపు విశాఖకు రానున్నారు.అక్కడ బిజెపి నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన గురించి ఈ సభలో ప్రస్తావించనున్నారు.ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతుంది.అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను బిజెపి ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో పవన్ కు ఆహ్వానం అయినా అమిత్ షా తో పవన్ భేటీ అవుతారని ప్రచారం జరుగుతుంది.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ ఈరోజు మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంటు జిల్లా శక్తి కేంద్రం ఇన్చార్జిల తో సమావేశం అవుతారు.
సాయంత్రం శ్రీకాళహస్తి లో జరిగే సభలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి, రాత్రికి ఢిల్లీకి వెళ్తారు.అయితే ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబు పొత్తుల అంశంపై చర్చలు జరిపిన నేపథ్యంలో అమిత్ షా విశాఖలో ఏపీ బీజేపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించి, పొత్తుల అంశంపై చర్చించి, ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అమిత్ షా ప్రకటనపై అటు వైసీపీ కూడా ఆసక్తిగానే ఉంది.







