రైతులకు భరోసా ఇచ్చేందుకే అమిత్ షా వచ్చారు..: ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు గోస -బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం లేదని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఎత్తేశారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

రైతు రుణమాఫీ కూడా మోసమన్న ఆయన కేవలం ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు