అమెరికాలో తెలుగు సంఘాలలో ఉన్న అతి పెద్ద సంఘాలలో ఒకటి అమెరికా తెలుగు అసోసియేషన్ ( ఆటా ).భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు అందించేలా ముఖ్యంగా తెలుగు బాషా, తెలుగు సాంప్రదాయాలు తమ పిల్లలకు అమెరికాలోని తెలుగు సమాజానికి తెలియజేస్తూ అమెరికాలో ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఆటా.
సంగీతం, తెలుగు కళలు, భారతీయ కళలపై ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.అలాగే తెలుగు రాష్ట్రాల నుంచీ అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్ధులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది ఆటా.తాజాగా అమెరికాలోని విద్యార్ధులకు ఆటా తమ సంస్థ నుంచీ స్కాలర్ షిప్ లు అందిస్తున్నట్టుగా ప్రకటించింది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్ధులకు ప్రత్యేకమైన ఉపకార వేతనాలను “ఆటా యూత్ స్కాలర్ షిప్ : 2022 -23” ఏడాదికి గాను అందిస్తోంది.హై స్కూల్ స్థాయి నుంచీ కాలేజీ స్థాయి విద్య కు వెళ్ళే వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులుగా ప్రకటించింది.ఈ స్కాలర్ షిప్ లు విద్యార్ధులకు ఎంతో ఉపయోగ పాడుతాయని ప్రకటించింది.
స్కాలర్ షిప్ పొందేందుకు అర్హతలు
– హై స్కూల్ నుంచీ కళాశాలకు వెళ్ళే విద్యార్ధులు, హై స్కూల్ స్థాయిలో సీనియర్స్ స్కాలర్ షిప్ కు అర్హులు.
– స్కాలర్ షిప్ కి అప్ప్లై చేసుకునే వారు తప్పకుండా ఆటా లో సభ్యులుగా ఉండాలి
– భారతీయ కళలపై, సంస్కృతీ సాంప్రదాయాలపై అవగాహన ఉండాలి
– SAT అలాగే ACT లలో స్కోర్స్ సాధించి ఉండాలి
ఇదిలాఉంటే ఆటా ఎంపిక చేసిన సుమారు 10 విద్యార్ధులకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు.అర్హత సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి సుమారు 1000 డాలర్ల ( భారతీయ కరెన్సీ లో రూ.79000 ఉపకార వేతనం అందుతుంది.జులై 31 వరకూ అప్లికేషన్స్ స్వీకరించబడును.
తుది విజేతలను ఆగస్టు 1 వ తేదీన ప్రకటిస్తారు.మరిన్ని వివరాలకు ఆటా బ్రోచర్ ను అలాగే వెబ్సైటు ను పరిశీలించవచ్చు.