ఒక సినిమా ప్లాప్ అయితే నిర్మాత లు మరియు బయ్యర్ల మద్య గొడవలు ఉంటాయి.నిర్మాత లు తమకు కొంత డబ్బు అయినా వెనక్కు ఇవ్వాల్సిందిగా బయ్యర్లు డిమాండ్ చేస్తారు.
ఆ విషయం లో న్యాయం అనిపిస్తే అప్పుడప్పుడు హీరోలు మరియు దర్శకులు కొంత మొత్తం ను తమ పారితోషికం నుండి నిర్మాతకు వెనక్కు ఇచ్చి ఆ డబ్బు కు కొంత మొత్తం ను కలిపి నిర్మాతను ఇవ్వమనడం మనం చూస్తూ ఉంటాం.కాని ఇక్కడ ఆచార్య విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు జట్టు పీక్కుంటున్నారు.
ఆచార్య సినిమా విడుదల అయ్యి చాలా వారాలు అయ్యింది.
అయినా కూడా కొరటాల శివ తదుపరి సినిమా ను మొదలు పెట్టలేదు.
కారణం ఏంటీ అంటే ఆచార్య సినిమా ప్లాప్.అందుకు సంబంధించిన చెల్లింపులు చెల్లించాల్సి ఉందని అంటున్నారు.
ఎన్టీఆర్ డేట్లు ఇచ్చినా కూడా కొరటాల శివ సినిమా ను మొదలు పెట్టక పోవడంతో అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ హామీ ఇవ్వడంతోనే బయ్యర్లు చాలా మంది భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట.

కొన్ని ఏరియాల్లో బయ్యర్ల తో పాటు కొరటాల శివ కూడా భాగస్వామిగా ఉన్నాడట.అందుకే ఆ విషయంలో కొరటాల శివ ఒక స్పష్టత ఇచ్చే వరకు తదుపరి సినిమా కు వెళ్లకుండా బయ్యర్లు అడ్డుకుంటున్నారట.ఇటీవలే అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు కూడా ఈ విషయం లో రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.కొరటాల శివ కొంత మేరకు నష్టాలను భరించేందుకు సిద్ధం అవ్వాల్సి వచ్చిందట.
అలా ఆచార్య నష్టాలతో కొరటాల శివ కు సంబంధం కలిగి ఉంది.







