75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... ఢిల్లీలో అమెరికన్ సింగర్ ప్రదర్శన

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రఖ్యాత అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఇండియాకు రానున్నారు.అక్కడ ఆమె ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

 American Singer Mary Millben To Attend 75th Independence Day Celebrations In Ind-TeluguStop.com

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను అమితంగా ఇష్టపడే ఆమె.గతంలో ‘‘ ఓం జై జగదీష్ హరే’’ , ‘‘జన గణ మన ’’ అంటూ పాటలు పాడటంతో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.తన భారతదేశ పర్యటనకు సంబంధించి మిల్బెన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.‘‘1959లో భారతదేశానికి వచ్చిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అడుగుజాడల్లో… భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సాంస్కృతిక రాయబారిగా అమెరికాకు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గౌరవం’’ అని వ్యాఖ్యానించారు.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఆహ్వానం మేరకు తాను భారత్‌కు వెళ్తున్నట్లు మేరీ తెలిపారు.సంపన్నమైన భారతదేశాన్ని ఎప్పుడెప్పుడు సందర్శిస్తానా అని ఆతృతగా వుందన్నారు.

భారత్ – అమెరికాల మధ్య వున్న ప్రజాస్వామ్య మైత్రిని హైలైట్ చేయడం చాలా ఆనందంగా వుందని మిల్బెన్ వ్యాఖ్యానించారు.జీవితంలో తొలిసారిగా భారతదేశానికి వెళ్తున్న తన హృదయంలో మార్టిన్ లూథర్ కింగ్ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయన్నారు.

ఇతర దేశాలకు తాను పర్యాటకురాలిగా వెళ్లవచ్చు.కానీ భారతదేశానికి మాత్రం యాత్రికురాలిగా వస్తానని మేరీ వ్యాఖ్యానించారు.

Telugu Delhi, India, Jana Gana Mana, Mary Millben-Telugu NRI

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఐసీసీఆర్ ద్వారా భారతదేశానికి ఆహ్వానించబడిన తొలి అమెరికన్ కళాకారిణిగా మిల్బెన్ రికార్డుల్లోకెక్కారు.అమెరికా సంయుక్త రాష్ట్రాల తరపున ప్రాతినిథ్యం వహించే అధికారిక అతిథిగా మిల్బెన్ హాజరవుతున్నారు.ఎన్ఎఫ్‌టీ గ్లోబల్ కంపెనీ Abris.io కో ఫౌండర్ అండ్ సీఈవో, యూఎస్ – ఇండియా సంబంధాలపై వ్యూహాత్మక సలహాదారు అయిన ప్రియా సమంత్‌తో కలిసి మిల్బెన్ తొలిసారిగా ఇండియాస్పోరా గ్లోబల్ ఫోరమ్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.

కాగా.74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2020లో మిల్బెన్.భారత జాతీయ గీతాన్ని వర్చువల్‌గా ప్రదర్శించారు.

తర్వాత అదే ఏడాది జరిగిన దీపావళి వేడుకల్లో ‘‘ఓం జగదీష్ హరే’’ అంటూ ప్రదర్శన ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube