అమెరికా గన్ కల్చర్...ఒకరి మృతి...త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం..!!!

అగ్ర రాజ్యం అమెరికా పరువును బజారుకీడ్చే సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి.అయితే ఏ ఘటనకైనా సరే ఏదో ఒక కారణం చెప్పగలిగే అమెరికా కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రం బదులు చెప్పలేక పోతోంది.

 American Gun Culture One's Death Huge Accident Missed In Error , America, Gun-TeluguStop.com

ఏళ్ళ తరబడి నలుగుతున్న ఓ సమస్యకు, అమెరికాలోని ప్రజా సంఘాలు, భాదిత తల్లి తండ్రులు ముక్త కంఠం తో ఖండిస్తున్న ఓ సమస్యకు అమెరికా ఇప్పటికి పరిష్కార దిశగా చర్యలు చేపట్టలేక పోతోంది.అమెరికాలో మెజారిటీ ప్రజలు అమెరికా పరువు తీస్తున్న ఈ సమస్యపై వ్యతిరేకత ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు.

ఆ సమస్యే గన్ కల్చర్.

అమెరికాలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న గన్ కల్చర్ పై ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

అమెరికా వ్యాప్తంగా ఏదో ఒక మూల తూటాలు పేలుతున్నా, ఈ తూటాల ధాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా సరే తుపాకి నియంత్రణ చట్టాలు మాత్రం బేలాగా చూస్తూ ఉంటాయి తప్ప ఏం చేయలేని పరిస్థితి.తాజాగా అమెరికాలో విద్యార్ధుల సంక్షేమం కోసం జరుగుతున్నా విరాళాల కార్యక్రమంపై ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపాడంతో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందగా సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయల పాలైన సంఘటన మరో సారి అమెరికా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.

అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలో డ్యూమాస్ అనే సిటీలో విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు అందించడానికి పేద విద్యార్ధులకు సాయం కోసం, అలాగే పలు విద్యా సంస్థలకు విరాళాలు అందించేందుకు గాను ఓ సంస్థ కార్ షో ఏర్పాటు చేసింది.ఈ కార్ షో జరుగుతున్న క్రమంలోనే గుర్తు తెలియని ఓ వ్యక్తి ఒక్కసారిగా ఈ కార్యక్రమంపై తుపాకి తో దాడి చేశాడు.

విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.భారీ సంఖ్యలో ఈ షో కి ప్రజలు హాజరవడంతో తొక్కిసలాట జరిగింది.

అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారని, సుమారు 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది.సమాచారం అందుకున్న డ్యూమాస్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ప్రతీ ఏటా ఈ సంస్థ ఇలాంటి కార్ షో లు నిర్వహిస్తూ ఎన్నో విద్యా సంస్థలు, విద్యార్ధులకు సాయం అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube