మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది.దీంతో క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైంది.ఇప్పటికే సోషల్ మీడియాలో గత ఐపీఎల్ రికార్డులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వీరులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకూ ఐపీఎల్ టోర్నీ 14 సార్లు జరిగింది.
ఈ 14 సీజన్లలో ఒక ప్లేయర్ ఏకంగా 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అతడు మరెవరో కాదు సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్.
ఈ గ్రేట్ ప్లేయర్ మొత్తం 14 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఏబీ డివిలియర్స్ ఇప్పటివరకు ఐపీఎల్లో 184 మ్యాచ్ ఆడి ఏకంగా 5,162 పరుగులు చేశాడు.
అంటే సగటున 39 పరుగులు అతడు సాధించాడు.అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఈ ప్లేయర్ మూడు సెంచరీలు చేయగా.46 హాఫ్ సెంచరీలు చేసి ఆశ్చర్యపరిచాడు.20 ఓవర్ల టీ 20 మ్యాచ్ లలో అతడు సాధించిన హైయెస్ట్ స్కోర్ 133.

ఏబీ డివిలియర్స్ తర్వాత వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.క్రిస్ గేల్ 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని ఈ జాబితాలో రెండవ ప్లేయర్ గా నిలుస్తున్నాడు.ఇక 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని థర్డ్ ప్లేస్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ నిలుస్తున్నాడు.ఫోర్త్ ప్లేస్ లో మహేంద్ర సింగ్ ధోనీ, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
వీరిద్దరూ కూడా 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నారు.







