పనిచేసే సంస్థలోని రహస్య సమాచారం లీక్, మిత్రుడితో కలిసి అక్రమార్జన .. అమెరికాలో దోషిగా తేలిన భారతీయుడు

మాజీ గోల్డ్‌మాన్ సాచ్స్( Goldman Sachs ) ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ , భారత సంతతికి చెందిన బ్రిజేష్ గోయెల్‌ను( Brijesh Goel ) ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు గాను న్యూయార్క్‌లోని జ్యూరీ దోషిగా తేల్చింది.విచారణ సందర్భంగా అతని అక్రమాలను ప్రాసిక్యూటర్లు జ్యూరీ దృష్టికి తీసుకెళ్లారు.

 America Ex-goldman Sachs Banker Brijesh Goel Convicted Of Insider Trading Detail-TeluguStop.com

గోల్డ్‌మాన్‌లో జరిగిన ఒప్పందాల గురించి బార్‌క్లేస్‌కు చెందిన అక్షయ్ నిరంజన్‌కు బ్రిజేష్ సమాచారం అందించినట్లు విచారణలో తేలింది.తద్వారా 2,80,000 డాలర్లను వీరు ఆర్జించారు.

ఈ నేరానికి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 19న బ్రిజేష్‌కు శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యూయార్క్ దక్షిణ జిల్లా అటార్నీ డామియన్ విలియమ్స్ ప్రకటించారు.బ్రిజేష్ తన యజమానికి నమ్మక ద్రోహం చేశాడని.

సంస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని తన స్క్వాష్ భాగస్వామితో పంచుకుని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు( Insider Trading ) పాల్పడినట్లు అటార్నీ పేర్కొన్నారు.

నేరారోపణ, పబ్లిక్ కోర్ట్ ప్రొసీడింగ్స్, ఫైలింగ్స్‌లో చేసిన స్టేట్‌మెంట్‌లను బట్టి.

బ్రిజేష్ గోయల్ గోల్డ్‌మాన్ సాచ్స్‌కు చెందిన ఫర్మ్‌వైడ్ కాపిటల్ కమిటీ, క్రెడిట్ మార్కెట్స్ క్యాపిటల్ కమిటీల అంతర్గత సమాచారంతో కూడిన ఈ మెయిల్స్‌ను సంపాదించాడు.గోల్డ్‌మాన్ సాచ్స్ ఫైనాన్సింగ్ వివరాలు, సంస్థల విలీనం, ఇతర లావాదేవీల గురించిన వివరణాత్మక సమాచారం , విశ్లేషణ సదరు ఈ మెయిల్స్‌లో వుంది.

తన విధులను , అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ రహస్య సమాచారాన్ని న్యూయార్క్‌లోని మరో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో పనిచేసే తన మిత్రుడు నిరంజన్‌కు( Niranjan ) బ్రిజేష్ తెలియజేశాడు.

Telugu Americagoldman, Brijesh Goel, Goldman Sachs, Insider, York, Niranjan, Dam

దీని సాయంతో నిరంజన్ తన సోదరుడి పేరు మీదున్న బ్రోకరేజ్ ఖాతాలలో షార్ట్ డేటెడ్ , ఔట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్‌లతో సహా పలు కాల్ ఆప్షన్‌లను ట్రేడ్ చేయడానికి ఉపయోగించాడు.గోయల్, నిరంజన్‌లు తమ ట్రేడింగ్ నుంచి వచ్చిన లాభాలను పంచుకున్నారని అటార్నీ తెలిపారు.2017 నుంచి 2018 మధ్యకాలంలో గోల్డ్‌మాన్ సాచ్స్‌ పాల్గొన్న కనీసం ఆరు ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని నిరంజన్‌తో గోయెల్ పంచుకున్నాడు.

Telugu Americagoldman, Brijesh Goel, Goldman Sachs, Insider, York, Niranjan, Dam

ఈ కేసుకు సంబంధించి గతేడాది మే, జూన్ మధ్య కాలంలో న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌లోని గ్రాండ్ జ్యూరీ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ చేపట్టిన విచారణను గోయెల్ అడ్డుకునేందుకు యత్నించాడు.కీలక సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణలను తొలగించాల్సిందిగా నిరంజన్‌ని కోరాడు.సెక్యూరిటీల మోసం, న్యాయ విచారణను అడ్డుకోవడం వంటి సంక్లిష్టమైన అభియోగాలను బ్రిజేష్ గోయెల్‌పై మోపారు.వీటిలో ఒక్కో నేరానికి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube