చాలా మంది పిల్లలని బాగా గారం చేసి పెంచుతారు.వారు ఆడింది ఆట పాడింది పాటగా చూస్తారు.
చిన్నతనంలో చేసే ముద్దు పెద్దయ్యాక తల్లి తండ్రులకి పెద్ద భారం అవుతుంది.అప్పుడు లబో దిబో మన్నా చేసేది ఏమి లేదు.
వాళ్ళు అడిగే కోర్కెలు తీర్చాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది.అందుకే చిన్నతనం నుంచీ డబ్బు విలువ తెలిసేలా చేయాలి.
అలా చేయాలంటే ఏమి చేయాలి.ఇదిగో ఈ అమెరికా తల్లి ఐడియాని ఫాలో అయ్యిపొండి.

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని డబ్లిన్ ప్రాంతానికి చెందిన మరియన్ అనే మహిళ తన పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటోంది.ఆమె పిల్లలు ఒకరోజు తమకి సెల్ ఫోన్ కొనమని, మరొక రోజు తమని ట్రిప్ కి తీసుకువెళ్ళమని అడుగుతూ గోల గోల చేసేవారట.వారి కోర్కెలకి పరిష్కారం ఆలోచించిన ఆమె స్కూల్ నుంచీ వచ్చే సరికి గోడపై కొన్ని పేపర్ లు అంటించిందట.వాటిని చూసి ఆమె పిల్లలు షాక్ అయ్యారట.
ఇంతకీ ఆ పపెర్ ల మీద ఏమి ఉందంటే.
కిచెన్ మేనేజర్ , లీడ్ హౌస్ కీపర్, లాండ్రి సుపెర్వైజర్ ఉద్యోగాలు మామ్ క్రెడిట్ యూనియన్ లో ఖాళీలు ఉన్నారంటూ ప్రకటించింది.
అంతేకాదు పిల్లలతో ఇంట్లో పనులు మొత్తం చేయించింది.ఆ తరువాత వారి కోర్కెలు తీర్చుతానని తెలిపిందట.
పిల్లలకి డబ్బు విలువ తెలియాలంటే ఇలా చిన్న చిన్న భాద్యతలు అప్పగిస్తే భవిష్యత్తులో బాగుపడుతారు అంటూ సందేశం కూడా ఇచ్చిందట.అంతేకాదు నేట్టింట్లో ఈ ఫోటోలని పోస్ట్ చేయగా లక్షల కొద్దీ ఈ పోస్ట్ షేర్ అయ్యిందట నెటిజన్లు కూడా ఆ అమ్మ ఐడియా కి ఫిదా అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.








