బ్రిటన్ ఎంపీ నోట కూడా అదే మాట,నెక్స్ట్ మోడీ నే అంటూ ట్వీట్

ఇటీవల వరుసగా బీజేపీ నేతలు మృతి చెందుతున్న విషయం విదితమే.మాజీ మంత్రి సుష్మాస్వరాజ్,జైట్లీ ఇలా వరుసగా మృతి చెందడం పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 Britain Mp Nazir Ahmad Controversial Comments On Modi-TeluguStop.com

విపక్షాలు దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నాయి అని అందుకే వరుసగా బీజేపీ నేతలు మృతి చెందుతున్నారు అంటూ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.సాధ్వి వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అయితే బీజేపీ పార్టీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు కానీ ఈ వరుస మరణాల పై బ్రిటన్ ఎంపీ స్పందించి ప్రధాని మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.బీజేపీపై విపక్షాలు చేతబడి, వశీకరణం చేస్తోందని.అందుకే ముఖ్య నేతలంతా చనిపోతున్నారని ఎంపీ నజీర్ అహ్మద్ ట్విటర్‌లో కామెంట్స్ చేశాడు.‘తర్వాత మోదీయే’.అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం.

Telugu Arun Jaitley, Britainmp, Narendra Modi, Sushma Swaraj-

అయితే అతడి ట్వీట్ చూసిన నెటిజన్లు బ్రిటన్ ఎంపీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.మరోపక్క కేంద్రమంత్రి రిజుజు కూడా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో నజీర్ పై మండిపడ్డారు.ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎలా ప్రవేశించారో అర్ధం కావడం లేదని ఆయన విరుచుకుపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube