రెండుసార్లు ఫెయిల్.. మూడో ప్రయత్నంలో ఐఏఎస్.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే గ్రేట్ అనాల్సిందే!

యూపీఎస్సీ( UPSC ) నిర్వహించే పరీక్షలో సక్సెస్ సాధించాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి.ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం కచ్చితంగా వస్తుందని చెప్పలేము.

బలమైన సంకల్పం ఉంటే సక్సెస్ సొంతమవుతుందని అంబికా రైనా( Ambika Raina ) ప్రూవ్ చేశారు.అంబికా రైనా స్వస్థలం జమ్మూ కశ్మీర్ కాగా ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ గా పని చేయడం గమనార్హం.

తండ్రి ఉద్యోగం వల్ల ఆమె వేర్వేరు ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది.గుజరాత్ లోని ప్రముఖ యూనివర్సిటీ నుంచి అర్కిటెక్చర్ డిగ్రీని పూర్తి చేసిన అంబికా రైనా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో ఉన్న ఒక కంపెనీ నుంచి ఇంటర్న్ షిప్ ఆఫర్ తో పాటు ఇతర ఉద్యోగ ఆఫర్లను సైతం సొంతం చేసుకున్నారు.

మంచి వేతనం వచ్చే జాబ్ ను వదులుకున్న అంబికా రైనా ఐఏఎస్ లక్ష్యాన్ని ఎంచుకుని చివరకు ఆ లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది.

Advertisement

తొలి రెండు ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలను అందుకోని అంబికా రైనా మూడో ప్రయత్నంలో ఐఏఎస్ జాబ్ సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని ముందడుగులు వేస్తున్న అంబికా రైనా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం.స్విట్జర్లాండ్ దేశం నుంచి భారీ వేతనంతో ఆఫర్లు వస్తున్నా అవి లెక్క చేయకుండా ఐఏఎస్ సాధించి అంబికా రైనా ఒక్కో అడుగు పైకి ఎదుగుతున్నారు.

ఎంతోమంది మహిళలకు అంబికా రైనా స్పూర్తిగా నిలిచారు.అంబికా రైనా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అంబికా రైనాను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

అంబికా రైనా టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అంబికా తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు