ఐపీఎస్ ఆఫీసర్( IPS ) కావాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రేయింబవళ్లు కష్టపడితే మాత్రమే ఐపీఎస్ స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుంది.
పదో తరగతి కూడా చదవని అంబిక( Ambika ) చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ పరేడ్ చూడటానికి వెళ్లారు.ఆ సమయంలో సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం చూసి అదే గౌరవం తనకు కూడా కావాలని కోరుకున్నారు.
కానిస్టేబుల్( Constable ) అయిన భర్తకు ఆ విషయం చెప్పగా మొదట వద్దని వారించినా ఆమె పట్టుదల చూసి ఆ తర్వాత ఆమెను ప్రైవేట్ కోచింగ్ కు పంపించాడు.అలా చదివి పది, ఇంటర్, డిగ్రీ పాసైన అంబిక ఆ తర్వాత సివిల్స్ కు( Civils ) ప్రిపేర్ కావాలని అనుకున్నారు.
తాము నివశించే ప్రాంతంలో సరైన కోచింగ్ సెంటర్ లేకపోవడంతో భర్త కోచింగ్ కోసం అంబికను చెన్నైకు పంపించాడు.పిల్లలను చూసుకునే బాధ్యతను సైతం భర్తే తీసుకున్నాడు.
అయితే రెండు ప్రయత్నాలలో అంబికకు నిరాశ ఎదురైంది.మళ్లీ ఎంతో కష్టపడిన అంబిక 2008లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు.ఆ తర్వాత అంబిక హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకోవడం గమనార్హం.ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా ఎంపికైన అంబిక తన తెగువతో ముంబాయి శివంగిగా పేరు తెచ్చుకున్నారు.
ఎంతో కష్టపడి పని చేసి ఎన్నో పురస్కారాలను సైతం ఆమె అందుకున్నారు.
ఆమె లైఫ్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.అంబిక కష్టపడి ఎదిగిన తీరు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని భావించే ఎంతోమందికి వాళ్ల వాళ్ల లక్ష్యాలను చేరుకునేలా చేస్తుందని చెప్పవచ్చు.ఐపీఎస్ అంబిక కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.