తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ బెయిల్ పై విడుదల అయ్యారు.
ఈ క్రమంలో బయటకు వచ్చిన నందకుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు అధికారులపై తెలంగాణ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు.కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేసి తన పొజిషన్ లో ఉన్న బిల్డింగ్ ను కూల్చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.